ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి జగన్ సర్కారు షాక్ ఇచ్చింది. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి లో గల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి  ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ నోటీసులు అంటించింది. ఎందుకంటే 2017 లో 20 కోట్లు తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా చెల్లించాలని కోరుతూ హామీదారుల పేరుతో సహా ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ నోటీసులు ఇచ్చింది.


గతంలో జీవన్ రెడ్డి తీసుకున్న రుణం.. వడ్డీతో సహా 45 కోట్లు  పైచిలుకు బకాయిలు ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ  నోటీసుల్లో పేర్కొంది. జీవన్ రెడ్డి మాల్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి భార్య రజితకు పేరుతో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంస్థ  ఈ నోటీసులు జారీ చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: