పాకిస్థాన్‌ కొత్త ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. పాక్‌ ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్‌ షరీఫ్‌ను నవాజ్‌ షరీఫ్‌ ఆధ్వర్యంలోని పీఎంఎల్‌-ఎన్‌ ప్రకటించింది. షెహబాజ్‌ ఎవరో కాదు.. పీఎంఎల్‌-ఎన్‌ చీఫ్‌ నవాజ్‌ షరీఫ్‌ సోదరుడే. అయితే ఫలితాల తర్వాత అయితే నవాజ్‌ షరీఫ్ కానీ.. పీపీపీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో కానీ.. ఇమ్రాన్ ఖాన్‌ కానీ ప్రధాని అవుతారని అంతా భావించారు. అయితే ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు.


అతి పెద్దపార్టీగా ఇమ్రాన్ ఖాన్‌ పార్టీ అవతరించినా మెజారిటీ రాలేదు. అందుకే పీఎంఎల్‌, పీపీపీ సంకీర్ణంగా ఏర్పడబోతున్నాయి. దీంతో ప్రధాని రేసు నుంచి తప్పుకుంటున్నట్లు పీపీపీ చీఫ్‌ బిలావల్‌ భుట్టో ప్రకటించారు. ప్రభుత్వ ఏర్పాటులో పీఎంఎల్‌-ఎన్‌కు సహకరిస్తామని భుట్టో ప్రకటించారు. నవాజ్‌ షరీఫ్‌తో అవగాహనకు వచ్చిన తర్వాత ప్రభుత్వంలో చేరబోమని భిలావల్‌ భుట్టో ప్రకటించారు. పాకిస్థాన్‌ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీకి రాని పూర్తి మెజార్టీ నేపథ్యంలో ఇప్పుడు నవాజ్‌ సోదరుడు షెహబాజ్‌ మరోసారి ప్రధాని పీఠం ఎక్కబోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: