వాహనదారులకు మళ్ళి షొక్క్ ఇవ్వడం ప్రారంభించింది పెట్రోల్ ధర... ఎందుకంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు నిన్నటివరకు భారీగా తగ్గాయి. మొన్నటివరకు పెరుగుతూ వచ్చిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు వారం రోజులలో భారీగా తగ్గుతూ వస్తున్నాయి. రెండు నెలల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న ఈ పెట్రోల్ ధర మొన్నటి 80 రూపాయలకు చేరింది.  

 

అలాగే డీజిల్ ధర 66 రూపాయిలు ఉన్నది 75 రూపాయలకు చేరింది. అయితే ఇప్పుడు అవే పెట్రోల్, డీజిల్ ధరలు వారం నుండి తగ్గుముఖం పట్టాయి... అయితే ఆ తగ్గుదలకు నేడు బ్రేక్ పడింది. దీంతో నేడు గురువారం హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ రూ. 79.43 వద్ద, డీజల్ ధర 74.03 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. 

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గటమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. కాగా పెట్రోల్, డీజిల్ ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఏది ఏమైనా.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా అయితే పెరిగాయో.. అలాగే తగ్గుతూ వస్తున్నాయి. మరి ఈ పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా ఎంత మాత్రం తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: