ఉద్యోగులకు ఇది దుర్వార్త. భవిష్య నిధిపై ఇచ్చే వడ్డీరేటను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల భవిష్యనిధిపై వడ్డీ రేటును EPFO తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో భవిష్య నిధిపై వడ్డీ రేటు 8.65 శాతం ఉండగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దానిని 8.5శాతానికి తగ్గించింది.


గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటులో 0.15శాతం కోత విధించింది. ఈ తగ్గింపు ఏడేళ్ల కనిష్టం. కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గాంగ్వార్ నేతృత్వంలో సమావేశమైన ఉద్యోగుల భవిష్య నిధి సంస్ధ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

 

అయితే.. ఈ నిర్ణయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయంలో లోటును భర్తీ చేసుకునేందుకు EPFO ఈ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: