ప్రధానంగా మన భారతీయ సంప్రదాయం లో బంగారం అనేది ఎంతో విలువైనది .. పెళ్లిళ్లు శుభకారాలు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది బంగారమే .. అలాగే పెట్టుబడి పెట్టాలనుకునే వారికి బంగారం అనేది మంచి సాధనం .. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్నాయి .. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గోల్డ్ ధర అమాంతం పెరిగిపోతూ వెళ్తుంది .. ఈ క్రమంలోనే మళ్లీ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు .. లక్ష రూపాయలు దాటేసింది ..


శుక్రవారం అనగా ఈరోజు ఉదయం నమోదైన వివరాల ప్రకారం .. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం పై .. రూ .2,120 పెరగ్గా..  22 క్యారెట్ల బంగారం పై రూ. 1,950 పెరిగింది .. గడిచిన మూడు రోజుల్లో 10 గ్రాముల బంగారం పై సుమారు 4000 కు పైగా పెరిగింది .. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం రేటు పెరుగుతూ వస్తుంది ..  ఔన్సు గోల్డ్ 48 డాలర్లు పెరిగి.. శుక్రవారం ఉదయం 3,427 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు వెండి ధర కూడా పెరిగింది. కిలో వెండిపై రూ. 1100 పెరిగింది .



ప్రధానంగా బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణం అమెరికా , చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తో పాటు .. ఇరాన్ , ఇజ్రాయిల్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం కారణమని కూడా తెలుస్తుంది .. అంతర్జాతీయంగా జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారమే సేఫ్ అని గోల్డ్ పై అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చెబుతున్నారు . దాని ఫలితంగా బంగారం రేట్లు భారీగా పెరుగుతున్నాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు .



దీంతో ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ...
♦ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లోనే ముఖ్య ప్రాంతాలైన హైదరాబాద్ , విజయవాడ , విశాఖపట్నం వంటి నగరాల్లో  బంగారం భారీగా పెరిగింది ..
♦ హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో.. 10 గ్రాముల 22క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,950కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,400 చేరింది.

అలాగే దేశంలోని ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే ...
♦ దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,100కు చేరగా.. 24 క్యారట్ల ధర రూ. 1,01,550కు చేరుకుంది.
♦ ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22 క్యారట్ల ప‌సిడి ధ‌ర రూ.92,950 కాగా.. 24క్యారెట్ల ధర రూ. 1,01,400కు చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: