
ఎస్సీలపై ఇన్ని దాడులు జరిగయా..!
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక ఎస్సీలపై మాత్రమే 6,107 అట్రాసిటీ కేసులు ఉన్నాయి. ఎస్టీలకు సంబంధించి 2,245 అట్రాసిటీ కేసు నమోదు అయ్యాయి. 2014 సంవత్సరంలో 205 మంది దళితులపై దాడులు జరపగా 2020-21 సంవత్సరం లో 1769 కి చేరాయి. వీటిలో స్త్రీలపై రేప్ కేసులు కూడా ఉన్నాయని సర్వే తెలిపింది. ఇది ఓన్లీ ఎఫ్ఐఆర్ నమోదైన కేసులు మాత్రమే. ఇంకా రాజీ కుదుర్చుకున్న కేసులు ఎన్నో ఉన్నాయి.
పరిహారం రావట్లే..
ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదూ అయినప్పుడు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ కింద బాధితులకి పరిహారం రూపంలో మైనర్ల అయితే 25%, మేజర్లు అయితే 50 శాతాన్ని ముందే అందించవలసి ఉంటుంది. మిగతా మొత్తం అమౌంట్ ను చార్జిషీట్ నమోదు అయ్యాక ఇవ్వాలి. కానీ ఇప్పటి వరకు ఒక కేసులో కూడా సమయానికి పరిహారం అందలేదు. అత్యాచారం హత్య కేసుల్లో ఎక్కువ పరిహారం కింద ఒక కుటుంబానికి మూడు నెలలకు సరిపోయే రేషన్ కూడా ఇవ్వాలి. మూడు నెలల్లోగా అర్హతను బట్టి ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గ్రామాల్లో అయితే మూడెకరాల భూమి అందించాలి. అలాగే ఇంట్లో ఎవరైనా పెద్ద వ్యక్తి ఉంటే అతనికి పింఛన్ కూడా అందించాలి. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసులో కూడా ఇలా జరగలేదు.