
తెలంగాణ రాష్ట్రము హైద్రాబాద్ కు చెందిన మానసికంగా ఇబ్బంది పడుతున్న ఒక మహిళ ఆరోగ్యం బాగవుతుందని నమ్మి నెల్లూరు జిల్లాలోని ఏ ఎస్ పేట మండలంలో ఉన్న మసీదు దగ్గరకు వచ్చింది. అయితే అనుకున్న విధంగానే నిన్న రాత్రి అనగా గురువారం సదరు మహిళ అక్కడ ఉన్న మసీదు దగ్గరకు వెళ్ళింది. అయితే మతి స్థిమితం సరిగా లేని ఆ మహిళ తన చుట్టు పక్కల జరుగుతున్న దాని గురించి ఆలోచించలేకపోయింది. అలా అనుకోకుండా అప్పటికే దర్గాకు దగ్గర సంభవించిన ఒక అగ్ని ప్రమాదంలో ఆమె మృతి చెందింది. అదే సమయంలో ఈమెకు సహాయంగా వచ్చినా మహిళ ఆమెను కాపాడడానికి వెళ్లి ఆ మంటల్లో చిక్కుకుంది.
కానీ అంత లోనే తేరుకుని బయటపడగల్గింది. దానితో సహాయంగా వచ్చిన మహిళ ఈ ప్రమాదంలో స్వల్ప గాయాల బారిన పడింది. వెంటనే గాయపడిన మహిళను దగ్గలోని హాస్పిటల్ కు పంపినట్లు తెలుస్తోంది. మరణించిన మహిళను పోస్ట్ మార్టం కు తరలించారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన మహిళ ఫాతిమాగా స్థానికులు గుర్తించారు. అయితే దర్గా దగ్గర సంభవించిన అగ్ని ప్రమాదం గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ చనిపోవడానికి ఫాతిమా వచ్చినట్లుంది. అంతా విధి అనుకుని చుట్టుపక్కలవారు వెళ్లిపోయారు.