కొన్ని రాష్ట్రాలలో అయితే అకాల వర్షాల కారణంగా వస్తున్న వరదలతో జనాలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే గత రెండు రోజుల నుంచి కూడా అటు బెంగళూరులో ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం బీభత్సం సృష్టిస్తుంది అని చెప్పాలి. ఇక వర్షం దాటికి ఎక్కడికక్కడ వరద నీరు నిలిచిపోయాయి. దీంతో ఇక జనావాసాల్లోకి నీరు వచ్చే పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. వర్షం బీభత్సం కారణంగా ఇక బెంగళూరులోని కాలనీలన్నీ కూడా వరద నీటితో నిండిపోయాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒక షాకింగ్ ఇన్సిడెంట్ కూడా చోటుచేసుకుంది. ఏకంగా ఇప్పుడు వరకు కార్లు, బైకులు వరద నీటిలో కొట్టుకుపోవడం చూశాం.
కానీ ఇక్కడ ఎంతో విలువైన బంగారు ఆభరణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మల్లీశ్వర్ 9వ క్రాస్ లోని ఒక బంగారం షాపులోకి వరద నీరు చేరడంతో దాదాపు రెండు కోట్ల వరకు నష్టం వచ్చింది. 80% వరకు బంగారు ఆభరణాలు వరద నీటిలో కొట్టుకుపోయాయని యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కార్పోరేషన్ కు ఫోన్ చేసిన కూడా వాళ్లు చర్యలు తీసుకోలేదని.. దీంతో ఇక తన షాప్ లో ఉన్న రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలు వరదల్లో కొట్టుకుపోయి మాయమయ్యాయి అంటూ ఆ షాప్ యజమాని వాపోయాడు. ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనగా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి