
ఇవేవీ సరిపోవు అన్నట్లు మరికొన్ని అనూహ్యమైన ఘటనలు చివరికి మనిషి ప్రాణాలను తీసేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో రేపు అనేది అసలు ఉంటుందా లేదా అనే భయంతోనే ప్రతి రోజు దినదిన గండంగా జీవితాన్ని గడిపేస్తూ ఉన్నాడు మనిషి అని చెప్పాలి. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం ఇలా కూడా ప్రాణాలు పోతాయా అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా నిద్రపోతున్న సమయంలోఅటు ఇటు దొర్లుతూ ఉండడం అందరికీ అలవాటు. కొంతమందికి ఇలానిద్రలో దొర్లే అలవాటు కాస్త ఎక్కువగా ఉంటుంది.
కానీ నిద్రలో దొర్లే అలవాటే చివరికి ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరేడు గుంట వాసి నత్తెట్ల అంజయ్య హైదరాబాద్ కి వలస వచ్చాడు. కూకట్పల్లి ప్రశాంత్ నగర్ లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే వేసవి తాపం వల్ల రోజు రాత్రి తను ఉంటున్న భవనం పైన నిద్రపోయేవాడు అంజయ్య. ఇక ఆ భవనానికి పిట్టగోడలేదు. అయితే రోజు మాదిరిగానే ఇటీవల రాత్రి సమయంలో నిద్రపోయాడు. ఇక గాఢ నిద్రలో దొర్లుకుంటూ బిల్డింగ్ పైనుంచి కింద పడి చనిపోయాడు. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.