
ఉదాహరణకు ఉత్తర్ ప్రదేశ్ ను చూసుకున్నట్లయితే బరేలీ జిల్లా బోథాపురి స్టేషన్ పరిధిలోని శివాలయానికి శుక్రవారం ఇద్దరు ముస్లిం మహిళలు సబీనా, సబీనా (తల్లీకూతురు) వెళ్లి నమాజ్ చేశారు. అలా చేయమని చెప్పింది వాళ్ల మత గురువే. దీని ముఖ్య ఉద్దేశం మత ఘర్షణలు సృష్టించడం. అలా చేయోద్దని అక్కడి హిందువులు అభ్యంతరం చెప్పినా వాళ్లు వినకుండా నమాజ్ చేశారని తెలుస్తోంది.
అయితే అక్కడున్న గ్రామస్థులు ఎంతో సంయమనం పాటించారు. వాళ్లపై దాడి చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే వేరే ముస్లిం ప్రార్థనా స్థలానికి వెళ్లి హిందువులు పూజలు చేస్తే కనీవినీ ఎరుగని రీతిలో మత ఘర్షణలు చెలరేగేవి. తర్వాత పోలీసులు వచ్చి వాళ్లను విచారిస్తే మా మత పెద్దనే ఇలా చేయమని చెప్పారని.. ఇలా చేస్తే మంచి జరుగుతుందని చెప్పారని వారు వివరించారు. ‘నేను గుడికి వెళ్లి దండం పెట్టుకుంటే అంతా మంచే జరుగుందని వాళ్లకు చెప్పాను. నా మాటను సరిగా అర్థం చేసుకోలేదు. వాళ్లు పొరపాటు పడి ప్రార్థన అనుకొని నమాజ్ చేశారు” అని మత పెద్ద తెలివిగా సమాధానమిచ్చారు.
ఇక్కడ విషయమేమిటంటే రెచ్చగొట్టే చర్యలకు వాళ్లు పూనుకున్నారు. అక్కడ ముస్లిం మహిళలపై దాడి జరిగితే హిందువులు ముస్లింలపై దాడి చేశారనే ప్రచారం చేసి మత ఘర్షణలు సృష్టించి అల్లకల్లోలం చేసేవారు. ఇక్కడి హిందువులు సంయమనం పాటించి పెద్ద ముప్పునే తప్పించారని చెప్పవచ్చు. ఏదీ ఏమైనా ఇలాంటి వాళ్లు దేశానికి ప్రమాదం.