
ఇటీవల సాయి పల్లవి, మరో వ్యక్తి ఇద్దరూ కలిసి ఒకే ఫ్రేం లో దండలు వేసుకొని నిల్చొన్నారు. ఇంత అందంగా ఉన్న సాయి పల్లవి నల్లగా ఉన్న కూడా ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని ఓ పాజిటివ్ అంశాన్ని ప్రచారం చేశారు. దీంతో పాటు ఆమెకు పెళ్లయింది అనే అంశం కూడా జనాల్లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం సాయి పల్లవి సినిమాలతో బిజీగా ఉంటోంది. చాలా రోజుల తర్వాత తెలుగులో నాగ చైతన్యతో కలిసి ఓ సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపింది. దీంతో పాటు తమిళంలోను ఓ సినిమా చేస్తోంది. ఎప్పుడూ పాత్ర కబుర్లతో ఆకర్షించే ఆమె పెళ్లి అయిందనే కొత్త వదంతులు వచ్చాయి.
సాధారణంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సాయి పల్లవి ఈ రూమర్ తో ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఈ అంశంపై ఎక్స్ వేదికగా స్పందించారు. సినిమాల విషయాలను పంచుకోవాల్సిన ఈ సమయంలో ఇలాంటి వదంతులపై మాట్లాడాల్సి వస్తోంది అని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సినిమా పూజా కార్యక్రమంలోని ఫొటోను జోడించి ఇలా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యక్తికి ఇలాంటి ఇబ్బందులు కలిగించడం నీచమైన చర్య అని ఆమె వ్యాఖ్యానించారు.