
ఒక రకంగా వారు రామారావు మానసిక క్షోభతో చనిపోవడానికి కారణం అయ్యారంటారు. కానీ గతంలో వాళ్ళు ఎన్టీఆర్ ని ఎంత బాధ పెట్టారో, ఎంత మానసికంగా హింసించారో ఇప్పుడు అదే పరిస్థితిని అనుభవిస్తున్నారని కొందరు అంటుంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒకరకంగా రామారావుకి జరిగిన అవమానానికి ప్రతిఫలంగా ఇప్పుడు రామోజీరావుకి, చంద్రబాబు నాయుడుకి గుణపాఠం చెప్తుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అని కొంతమంది అంటున్నారు.
ఎందుకంటే నందమూరి కుటుంబంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఇప్పుడు పార్టీకి దిశా నిర్దేశం అనుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ పని చేయలేకపోయారు. దానికి ఆయన కారణాలు ఆయనకి ఉండవచ్చు. ముఖ్యంగా అసలు ఆయనకి రాజకీయాల్లోనే ప్రస్తుతం ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇటీవల కార్టూన్ లో దేశంలోనే ధనిక సీఎంగా ప్రధాని కన్నా మీది ఎన్ని కోట్లు ఎక్కువ ఉండవచ్చు సార్ అంటూ మోడీ ఆస్తి 2.58కోట్లను చూస్తూ ఒక బంట్రోతు జగన్ ను అడిగినట్లు చెప్పుకొచ్చారు. అయితే ఇది డిజైన్ చేసిన పత్రిక యజమానికి తెలియదా జగన్ కంటే కూడా చంద్రబాబు ఆస్తే ఎక్కువ అని అంటూ కొంతమంది అడుగుతున్నారు. జగన్ ఆస్తి చట్టబద్ధంగా 550కోట్లు అయితే చంద్రబాబుది అదే చట్ట ప్రకారంగా 600కోట్ల పైచిలుకు అని లెక్కలు చెబుతున్నారు.