
తాజాగా ఆయన ఒక పోస్టు పెట్టారు. దాని సారాంశమేంటంటే చంద్రబాబు క్వాష్ పిటిషన్ ప్రస్తుతం అత్యంత ప్రధాన్యం సంతరించుకొంది. దేశవ్యాప్తంగా ఈ తీర్పు పలు కేసులపై ప్రభావం చూపుతుంది. చంద్రబాబు పై పెట్టిన 409ఏ సెక్షన్ కు వ్యతిరేకంగా లేవనెత్తిన అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17ఏ పలు కేసులకు కేస్ స్టడీగా మారుతుంది. ఏసీబీ కోర్టులో కూడా దర్యాప్తు సమయంలో మినీ ట్రయిల్ నిర్వహించాల్సిన అవసరం లేదు అని సుప్రీం కోర్టు తీర్పు దృష్ట్యా రిమాండ్ ఇవ్వడం చట్ట పరంగా సమంజసమే. 17 ఏ విషయంలో హైకోర్టు న్యాయమూర్తి తన సౌలభ్యం మేరకు తీర్పు ఇచ్చారు.
ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సందిగ్ధంలో వదిలి వేయదు. 2018 తర్వాత ఎఫ్ఐఆర్ వేసిన కేసుల్లో 409 సెక్షన్ పెట్టాలంటే ఆ వ్యక్తి అనుమతి తప్పనిసరి. భవిష్యత్తులో క్రిమినల్ బెంచ్ ట్రస్ట్ అనే చట్టం కింద దాక్కొని ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకూడదనే ఉద్దేశంతో 17ఏ అనే చట్టాన్ని తీసుకువచ్చారు. ఒకవేళ చంద్రబాబు కు తీర్పు వ్యతిరేకంగా వస్తే 2014 నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం పై కేసు పెట్టవచ్చు. దీనిపై సుప్రీం కోర్టు కేసును అమూలాగ్రం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని భావిద్దాం అని రాసుకొచ్చారు. మరి ఇది నిజమేనా?