ఆంధ్ర ప్రదేశ్ కు పరిశ్రమలు రావడం లేదని ఎల్లో మీడియా ప్రచారం చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు పెట్టుబడులు చాలా తక్కువగా వచ్చాయని చెబుతుంది. వచ్చేవి కూడా రాకుండా వైసీపీ సర్కారు చేస్తోందని మండిపడుతున్నారు. దీనిపై వైసీపీ సర్కారు కు అనుకూలంగా ఉండే సాక్షి ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు వస్తున్నాయో తెలుపుతూ ఒక ప్రత్యేక కథనం రాసుకొచ్చింది.  


తిరుపతి జిల్లా లో 10.3 కోట్లతో తడిగుంట పల్లి అన్నమయ్య జిల్లాలో 15 కోట్లతో  పారిశ్రామిక బ్లాక్  ఏర్పాటు చేయనున్నారు. కర్నూల్ జిల్లా, నంద్యాల జిల్లా, చిత్తూరు జిల్లా వెంకటాపూరం, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లా, తూ.గో కాల్వచర్ల, అనకాపల్లి జిల్లాలో, తణుకు, విశాఖ, అచ్యుతపురం తదితర ప్రాంతాల్లో పారిశ్రామికంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని సాక్షి తన కథనంలో పేర్కొంది. ఎక్కడ ఎంత పెట్టుబడి పెట్టనున్నారో తెలిపే విధంగా అది రానుంది.


ముఖ్యంగా పెట్టుబడులు తీసుకురావడంలో వైసీపీ సర్కారు చేస్తున్న కృషిని తెలియజేసింది. అయితే దీనిపై ఇప్పటికే రాష్ట్రంలో అప్పుల్లో కూరుకుపోయిందని ఇక పరిశ్రమలు అసలే రావడం లేదని టీడీపీ నాయకులు వైసీపీ సర్కారు పనితీరుపై మండిపడుతున్నారు. కానీ టీడీపీ హయాంలో చిన్న పరిశ్రమ వచ్చినా కూడా దాన్ని ఎక్కువగా పబ్లిసిటీ చేసుకునే వారు.. ప్రస్తుతం మాత్రం ఇన్ని కంపెనీలు రావడానికి ప్రయత్నాలు జరుగుతున్న ప్రజలకు మాత్రం తెలియజేయడం లేదు.


కేవలం చంద్రబాబు తీసుకువస్తేనే పథకాలు, పరిశ్రమలు అన్నట్లు జగన్ తెస్తే దానిలో తప్పులు వెతుకుతూ వైసీపీకి వ్యతిరేకంగా విచ్చల విడిగా వార్తలు ప్రచురిస్తున్నారు. కేవలం ఎల్లో మీడియా టీడీపీకి అనుకూలంగా వార్తలు రాయడం అటుంచితే ప్రభుత్వం చేసే మంచి పనులకు అడ్డు తగులుతోంది. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమల విషయంలో వ్యతిరేకంగా వార్తలు రాయడం వల్ల ఇక్కడికి రావాల్సిన పథకాలు కూడా రావడం లేదని వారు మాత్రం అర్థం చేసుకోలేక ఏపీకి నష్టం చేకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: