పాకిస్థాన్ సైన్యం రెండు వర్గాలుగా విడిపోయింది. ఐఎస్ఐ, తాలిబాన్లకు మద్దతుగా నిలుస్తున్న వర్గం ఒక వైపైతే, మరో వర్గం వారిని వ్యతిరేకించేవారు. ఇలా రెండుగా చీలిపోయింది పాక్ సైన్యం. దీంతో ఆప్ఘనిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంత రచ్చ రచ్చ జరుగుతున్నా పాకిస్థాన్ ప్రభుత్వం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరించడం పలు పరిణామాలకు దారి తీస్తుంది. సంచలన విషయం ఏమిటంటే పాకిస్థాన్ సైనికులు 5000 వేల మంది రాజీనామాకు సిద్ధపడ్డట్టు తెలుస్తుంది.


తాలిబాన్లను పాకిస్థాన్ ప్రభుత్వం చంపమని చెబుతున్నా ఒకప్పుడు వారిని పెంచి పోషించిన పాక్ సైన్యం వారిని చంపేందుకు వెనకాడుతోంది. ఎందుకంటే ఒకవేళ తాలిబన్ల ను మట్టుబెడితే వారు దిగే ప్రతి చర్యలు ఎంత బీభత్సంగా ఉంటాయో అందరి కంటే పాక్ సైనికులకు ఎక్కువగా తెలుసు. ఆప్ఘనిస్థాన్ లో అమెరికా సైన్యం ఉపసంహరించుకున్నాక తాలిబన్లు రచ్చ రచ్చ చేశారు. ఎంతో మంది అమాయకుల ప్రాణాలు తీశారు. అక్కడ సైన్యంలో పనిచేసిన వారి  భార్య, బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నారు.


ఇంతటి అరాచకానికి దిగిన తాలిబన్లతో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదనే భయం పాక్ సైనికుల్లో నెలకొంది. ఎందుకంటే దొంగ దెబ్బ తీయడం లో తాలిబన్ల తరువాతే ఎవరైనా ఇది కూడా వీరు నేర్పిన విద్య వీరి మెడకు ఇపుడు చుట్టుకుంటోంది. ఇంతకీ అసలు విషయమేంటంటే పాకిస్తాన్ మాజీ మేజర్ అదిల్  రాజా సంచలన విషయాన్ని బయట పెట్టాడు. అది పాకిస్తాన్ మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బాజ్వా,మాజీ ఐఏ ఎస్ చీఫ్ హమీద్ లకు సినీ నటీనటులను, సెలెబ్రెటీలను సేఫ్ హౌస్ లోకి  తీసుకొచ్చే పనులను సైనికులకు అప్పజెప్పేవారని ఆరోపిస్తున్నారు.


ఇలాంటి ఒక్కో అంశం తెరపైకి వస్తుండడంతో పాక్ ప్రభుత్వం, సైనికాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంకా ఇలాంటి విషయాలు బయటకు వస్తాయేమోనని పాక్ ఆర్మీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాలిబాన్లకు, పాక్ సైనికులకు ఎం జరగనుందో ఇంకొన్ని రోజుల్లో తేలనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: