
కానీ ఆ పని వేళలు వల్ల ఎవరికైనా లాభం ఉంటుందా.. ఎవరు నష్టపోతారు. ఎవరికి లాభం ఉంటుంది. తదితర అంశాలను ఎవరూ పరిగణించడం లేదు. ఒక వేళ ప్రభుత్వ కార్యాలయాలకు ఉదయం 7.30 గంటలకు రావాలంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చే వారు ఏ విధంగా రాగలరు. ఆఫీసుకు వచ్చే సరికి 12, ఒక్కోసారి 1 గంట కూడా కావచ్చు. అప్పటికే ఎంతో మంది లైన్లలో నిలుచుంటారు. వారికి కావాల్సిన పనులు జరగవు. రేపు రండి అంటూ అధికారులు తిరిగి పంపించేస్తుంటారు.
ఉదయం పిల్లలను స్కూలుకి, ట్యూషన్లకు పంపే గృహిణులు, ఒక వేళ ఆఫీసులకు వెళ్లాలంటే వారు ఉదయం ఎన్ని గంటలకు లేవాలి. తొమ్మిది గంటలకే ఆఫీసు అంటే 11 దాటినా కార్యాలయాలకు రాని ఆఫీసర్లు ఉంటారు. వారు సమయానికి రాకపోతే ఎలా.. వీటిన్నింటిని గురించి ఆలోచించి ప్రశ్నించే వారే కరవయ్యారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నించడంలో మన తెలుగు మీడియా మొదటి స్థానంలో నిలుస్తుంది. ఇలాంటి ప్రశ్నించే పత్రికలు అక్కడ లేకపోవడం బాధాకరమే అని చెప్పొచ్చు.