ఏపీలో రెండో సారికూడా త‌న ప్ర‌భుత్వ‌మే కొలువుదీరాల‌ని భావించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప్ర‌జ‌ల నుంచి అనూహ్య‌మైన ప‌రాజ‌యం ఎదురైంది. దీంతో ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు కూడా ప్ర‌జ‌లిచ్చిన తీర్పును జీర్ణించుకోలేక పోతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌జ‌ల అత్య‌ధిక మ‌ద్ద‌తు తో ఏర్పాటైన జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఏదో ఒక రూపంలో దాడి చేస్తున్నారు. నోటి వ‌చ్చిన తిట్ల‌న్నీస్వ‌యంగా తిట్టేశారు. త‌ర్వాత వేరేవారితోనూ తిట్టించారు. ఇక‌, ఇప్పుడు త‌న సొంత పార్టీ నాయ‌కుల‌తో టార్గెట్లు పెట్టి మ‌రీ తిట్టిస్తున్నారు. అయినా కూడా జ‌గ‌న్ పెద్ద‌గా చ‌లించ‌డం లేదు.



ఈ క్ర‌మంలోనే మంత్రుల మ‌ధ్య విభేదాలు సృష్టించేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల‌కు జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు కానీ, వారిని వాన‌పాములు చేశారంటూ.. ఆయ‌న గ‌తంలో అనేక సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించారు. త‌న అనుకూల మీడియాలోనూ రాయించారు.  ఫ‌లితంగా మంత్రుల మ‌ధ్య విభేదాలు వ‌చ్చి.. అంతిమంగా జ‌గ‌న్‌పై పోరు బాట ్ర‌పారంభిస్తార‌ని, తాను చూసి ఆనందించాల‌ని అనుకున్నారు. కానీ, ఈ విష‌యంలోనూ బాబు వ్యూహం స‌క్సెస్ కాలేదు. ఈ క్ర‌మంలోనే అధికారుల మ‌ధ్య విభేదాలు సృష్టించేందుకు ప్ర‌య‌త్నించారు. అనేక మంది అధికారుల‌ను జ‌గ‌న్ ప్ర‌బుత్వం అవ‌మానిస్తోంద‌ని పెద్ద యాగీ చేశారు.



అయితే, ఈ విష‌యాన్ని కూడా జ‌గ‌న్ ప్ర‌బుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. అదికారులు కూడా లైట్ తీసుకున్నారు. ఎవ‌రు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ప‌నిచేయ‌డం త‌ప్ప తాము చేయ‌గ‌లిగింది ఏమీల‌దేనుకున్నారు. అయినా కూడా చంద్ర‌బాబు ఇగో సాటిస్‌ఫై కావ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తాజాగా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి, ప్ర‌భుత్వానికి మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు పూనుకున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. పాపం సీఎస్‌- అంటూ చంద్ర‌బాబు త‌న అనుకూల మీడియాలో క‌థ‌నం రాయించుకున్నారు.



 ఒకటికి మించిన శాఖలకు సంబంధించిన అంశాలు, ఆ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన ఉత్తర్వులను జారీచేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎ్‌స)కే ఉంటుంది. బిజినెస్‌ రూల్స్‌ స్పష్టంగా చెబుతున్నది ఇదే! మొత్తం అధికార యాంత్రాంగానికి బాస్‌ సీఎస్‌! కానీ... ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీకి తెలియకుండానే, ఆమె ప్రమేయం లేకుండానే అతి కీలకమైన ఉత్తర్వులు జారీ అయిపోతున్నాయి.. అని తెగ ఫీల‌య్యారు. అయితే, దీనిని కూడా సీఎస్ లైట్ తీసుకున్నారు. కార‌ణం ఏంటంటే.. ఆమెకు పెద్ద‌గా తెలుగు రాదు. వ‌చ్చినా.. అస‌లు విష‌యం ఆమెకు ఇప్ప‌టికే బాగా అర్ధ‌మైంది కాబ‌ట్టి. సో.. బాబు ప్ర‌య‌త్నం మ‌రోసారి వృధా అయింద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: