ఏదైనా సాధించాలంటే కృషి పట్టుదల ఉండాలి రా అబ్బాయ్ అని ఎంత మొత్తుకున్నా చెవికి ఎక్కించుకోకుండా... దేనికైనా కాలం కలసి రావాలి అంటూ నెపాన్ని కాలం మీద నెట్టేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే  వారు తప్పనిసరిగా ఈ సింహాచలం గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ సింహాచలం అందరిలాంటి వ్యక్తి మాత్రం కాదు. పుట్టుకతోనే అంధుడు దానికి తోడు కటిక దారిద్య్రం. అన్నిటినీ అధిగమించి తన చిన్నప్పటి నుంచి కలగంటున్న కొలువును సొంతం చేసుకున్నారు. అయితే ఆ కొలువు కూడా ఆషామాషీ కొలువు ఏమీ కాదు ఎందరికో తీరని కలగా మిగిలిపోయిన ఐఏఎస్. ఈ కల సాకారం చేసుకునేందుకు సింహాచలం పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు మరి. అసలు ఈయన పుట్టిన దగ్గర నుంచి ఐఏఎస్ కొలువు సాధించేవరకు పడిన కష్టాలు,  ప్రయత్నాల గురించి చెప్పుకోవడం కంటే ముందుగా ఆయన నేపథ్యం గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఐఏఎస్ కొలువు సాధించడం అంటే గట్టిగా కష్టపడాలి.  మామూలు వ్యక్తులకు సైతం ఇది సాధించడమే గొప్ప ఘనకార్యం. అయితే పుట్టుకతోనే అంధత్వం ఉన్న సింహాచలం వంటివారు ఈ కొలువును సాధించేందుకు పడ్డ కష్టం ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 

IHG


 ఇక ఈయన నేపధ్యం చూదాం. తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గూడవల్లి గ్రామంలో కట్టా విజయ్ కుమార్ జన్మించారు. తండ్రి కట్టా  వాలి. తల్లి వెంకట నరసమ్మ. వీరికి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, రాంబాబు, సింహాచలం నలుగురు కుమారులు కాగా ఒక కుమార్తె. ఆమె పేరు దుర్గ. ఈ కుటుంబాన్ని పోషించేందుకు తండ్రి వాలి పాత గోనె సంచుల వ్యాపారం చేసే వారు.  ఆ అరకొర సంపాదనతోనే కుటుంబ భారాన్ని మోస్తూ వచ్చారు.  వీరిలో సింహాచలం పుట్టుకతోనే అంథుడు. తండ్రికి కుటుంబాన్ని పోషించడమే మోయలేని భారంగా ఉన్న పరిస్థితుల్లో చదివించడం అంటే అది తాహతుకు మించిన కోరిక. అయినా సింహాచలం ఆసక్తిని గమనించి పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఉన్న బ్రెయిలీ  పాఠశాలలో సింహాచలంను  చేర్పించారు. ఆ తర్వాత మల్కిపురం ఎంవీఎన్ జేఎస్ అండ్ ఆర్వీఆర్  డిగ్రీ కళాశాలలో దాతల సహకారంతో డిగ్రీ పూర్తి చేశారు. అయితే అనుకోకుండా ఆ సమయంలోనే తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో కుటుంబ ఆర్థిక మరింత దిగ  జారిపోయింది. 

IHG


తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబానికి అండగా నిలవాలని సింహాచలం చూసాడు. అప్పటికే ఐఏఎస్ అవ్వాలని బలమైన కోరికతో ఉన్న సింహాచలం  ఆ కోరికతో బీఈడీ కూడా పూర్తిచేసి తిరుపతి కేంద్రీయ విద్యాలయం లో టీచర్ ఉద్యోగం సంపాదించాడు. ఇక అక్కడ ఉద్యోగం చేస్తూనే సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు.  2014 సంవత్సరంలో సివిల్స్ పరీక్షలు రాసి 1212 ర్యాంక్ సాధించాడు. 2016 లో మరో ప్రయత్నం చేసి ఐఆర్ఎస్ కు ఎంపికయ్యాడు. ఆదాయపన్ను శాఖలో చేరి ఢిల్లీ, హైదరాబాద్  ఉద్యోగాలు చేశారు. అయినా  ఐఏఎస్ అవ్వలేదనే అసంతృప్తి ఆయనలో ఉండి పోయింది.  మళ్లీ 2019లో మరో ప్రయత్నం చేసి 457 ర్యాంకులు ఐఏఎస్ సాధించి తన కల సాకారం  చేసుకున్నారు. 

 


ముస్సోరీలో ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఏపీ కేడర్ కు ఎంపికయ్యారు. విజయనగరం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా  బాధ్యతలు స్వీకరించారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సింహాచలం నేపధ్యం కఠిక  పేదరికం, మరోవైపు పుట్టుకతోనే చూపు లేకపోవడం ఇలా అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొని ఆయన కలలు కన్న కొలువు సాధించడం నిజంగా ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే అంశమే. అన్నట్టు ఈ స్టోరీ లో హీరో, త్వరలో పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధం అవుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: