వ్యాక్సినేషన్, ఆక్సిజన్ అంశాలపై ప్రధానమంత్రి నరేంద్రమోడికి జగన్మోహన్ రెడ్డి రెండు లేఖలు రాశారు. రెండు లేఖల్లోను వ్యాక్సినేషన్ పై జగన్ చేసిన సూచన యావత్ దేశానికి సంబంధంచింది. దేశవిశాల హితం కోరే జగన్ టీకాల తయారీ టెక్నాలజీని వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల ఇతర ఫార్మా కంపెనీలకు కూడా బదలాయించాలని లేఖలో కోరారు. లేఖలోని ముఖ్య విషయం ఏమిటంటే భారత్ బయోటెక్ ఉత్పత్తిచేసిన కోవ్యాగ్జిన్ టీకా దేశావసరాలను తీర్చలేకపోతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏమిటంటే భారత్ బయోటెక్ కు ఉత్పత్తి సామర్ధ్యం పెంచేత శక్తి లేకపోవటమే. ప్రస్తుతం భారత్ బయెటెక్ ఉత్పత్తి సామర్ధ్యం నెలకు 5 కోట్ల డోసులు మాత్రమే.  ఈ లెక్కన దేశమంతటికి టీకాలు అందాలంటే చాలా నెలలు పడుతుంది. ఇక కోవీషీల్డ్ టీకాను తయారు చేస్తున్న సీరమ్ కంపెనీ ఉత్పత్తి సామర్ధ్యం నెలకు 6 కోట్లు. దీని లెక్కన చూసుకున్నా ఇప్పటిపుడే దేశవాసరాలను తీర్చటం సాధ్యంకాదు.




అందుకనే జగన్ తన లేఖలో రాసిందేమంటే కోవ్యాగ్జిన్ తయారుచేస్తున్న టీకాల ఫార్ములాను సామర్ధ్యం ఉన్న ఇతర ఫార్మాకంపెనీలతో పంచుకుంటే ఉత్పత్తి పెంచవచ్చని. సామర్ధ్యమున్న కంపెనీలకు టీకాల ఫార్ముల ఇచ్చి ఉత్పత్తి చేయిస్తే అప్పుడు దేశవవసరాలు తొందరగా తీరుతాయన్నది జగన్ మాట. అలాకాకుండా టీకా ఫార్ములాను భారత్ బయోటెక్ ఎవరితోను పంచుకోకపోతే అవసరానికి తగ్గట్లుగా టీకాలు ఉత్పత్తికావు, అందరికీ టీకాలు వేయించలేమని జగన్ స్పష్టంగా చెప్పారు. నిజానికి జగన్ చెప్పిందాట్లో తప్పేమీలేదు. పైగా సరైన సూచన చేసినట్లుగానే భావించాలి. భారత్ బయోటక్ కంపెనీ టీకా ఫార్ములా మాత్రమే చెప్పి సీరమ్ కంపెనీ విషయాన్ని వదిలేశారని అనుమానించే అవకాశం ఉంది. భారత్ బయోటెక్ లో ప్రభుత్వ వాటా ఉందట. అంటే ఒక విధంగా అది ప్రజల వాటా అన్నట్లే కదా.




ప్రజల వాటా ఉన్నది కాబట్టే భారత్ బయెటెక్ విషయంలో మాత్రమే జగన్ సూచన చేశారు. ఇక సీరమ్ కంపెనీ అంటే నూరుశాతం ప్రైవేటుసంస్ధ కాబట్టి అందులో వేలు పెట్టే అవకాశంలేదు. టీకాల తయారీ ఫార్ముల విషయంలో ఏ ఒక్క కంపెనీకో పేటెంటు ఉండకూడదనే వాదన ప్రపంచవ్యాప్తంగా బలంగా వినిపిస్తోంది. ఇదే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్ధ (డబ్య్లూహెచ్ఓ) కూడా సీరియస్ గా ఆలోచిస్తోంది. ఎందుకంటే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తున్న విపత్తు. కాబట్టి యావత్ ప్రపంచానికి అవసరమైన మందుల తయారీ పార్ములా ఏదో ఓ కంపెనీకి మాత్రమే సొంతంగా ఉండకూడదనే వాదన పెరిగిపోతోంది. మరి జగన్ చేసిన సూచనకు నరేంద్రమోడి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: