
దీంతో ఆయనను బూతుల మంత్రి అని టీడీపీ ఒక బ్రాండ్ వేసేసింది. అయితే.. ఇది నిన్నటి వరకు. కానీ, ఇప్పుడు అనూహ్యంగా నాని తన శైలిని మార్చుకున్నారు. తాను ఫైర్ కాదని.. ఇక నుంచి ఫ్లవరేనని అనుకు నేలా వ్యవహార శైలిలోనూ.. మాట తీరునలోనూ.. మార్పులు చూపిస్తున్నారు. దీంతో అందరూ కొడాలి నాని ని చూసి.. ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అదేసమయంలో ఈమార్పు మంచిదేనని అంటున్నారు. విషయంలోకి వెళ్తే.. గుడివాడలో సంక్రాంతిని పురస్కరించుకుని క్యాసినో నిర్వహించారని.. ఇది సాక్షాత్తూ.. కొడాలికే చెందిన కె-కన్వెన్షన్‌లో జరిగిందని.. టీడీపీ నేతలు ఆరోపించారు.
ఈ వివాదంలో కొంత ఆలస్యంగా జోక్యంచేసుకున్న కొడాలి నాని.. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పరుష పదాలతో విరుచుకుపడ్డారు. అయితే.. నాని వ్యాఖ్యలపై చంద్రబాబు కాకుండా.. పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్పందించారు. నానిపై కూడా ఆయన తీవ్రంగానే వ్యాఖ్యానిం చారు. దీనికి ప్రతిగా నాని కూడా స్పందించారు. అయితే.. ఈ వివాదం ఎటు పోతుందో.. అని అనుకున్న సమయంలో ఓ మీడియా సంస్థ.. ఇటు బుద్దా వెంకన్నను.. అటు కొడాలి నానిని ఒకే వేదికపై కి తీసుకువచ్చింది.
జరుగుతున్న పరిణామాలపై లైవ్‌లో చర్చించింది. ఈ సందర్భంగా టీడీపీ నేత బుద్దా వెంకన్న మాట్లాడు తూ.. తమ నాయకుడు చంద్రబాబును వ్యక్తిగతంగా విమర్శిస్తే.. తాము కూడా వ్యక్తిగతంగానే వ్యాఖ్యానిస్తా మన్నారు. అయితే.. వ్యక్తిగతంగా దూషించకపోతే.. తాము కూడా ఏమీ అనబోమన్నారు. దీనికి మంత్రి నాని కూడా ఓకే చెప్పారు. తాను వ్యక్తిగతంగా ఇకపై ఏమీ మాట్లాడబోనన్నారు. అనుకున్నట్టుగానే.. మంత్రి తన దూకుడు తగ్గించారు. తాజాగా విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ.. గుడివాడసెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీపై విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు.. అన్నగారి ని పట్టించుకోలేదని.. భారత రత్న కావాలంటూ.. ఊగారని.. కనీసం చేతిలో ఉన్నదానిని కూడా చేసుకోలేక పోయారని అన్నారు. కేంద్రంలో చక్రాలు తిప్పానన్న ప్పుడు కూడా అన్నగారు గుర్తుకు రాలేదని.. విమ ర్శించారు తప్ప.. ఎక్కడా చంద్రబాబు పైవ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. సో.. దీనిని బట్టి నాని తన పంథాను మార్చుకున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇది మంచి పరిణామమేనని చెబుతున్నారు. మరి ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగిస్తారో లేదో.. కానీ.. ఇప్పటికైతే మార్పు వచ్చిందనే అంటున్నారు.