
ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే.. టీడీపీని అధికారంలోకి తెచ్చుకోవాలని..నాయకుల కన్నా కూడా కేడర్‌కే ఎక్కువగా ఆశలు ఉన్నాయి. అందుకే చంద్రబాబు ఎలాంటి పిలుపు ఇచ్చినా.. నాయకుల కన్నా కూడా యువ కేడర్ దూసుకు వస్తోంది. పైగా నిరుద్యోగ యువత, డ్వాక్రా సంఘాలు, ఇతర మహిళా సంఘాల నేతలు కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరకత తో ఉన్నారు. ఏదైనా తమకు మేలు జరిగి ఉంటే.. అది చంద్రబాబు హయాంలోనే జరిగిందని వారు కుండ బద్దలు కొట్టి మరీ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వారి అండదండలు.. పార్టీ పుష్కలంగా లభిస్తున్నాయి.అందుకే.. చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు నాయకులు బయటకు రాకపోయినా(కొన్ని కొన్ని జిల్లాల్లో) యువతే ముందుండి.. ఆయా కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ్ముళ్లలో ఉన్న ఈ కసి చాలు.. పార్టీ ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు అని సీనియర్లు చెబుతున్నారు. అయితే.. వీరిని సరైన దిశగా నడిపించడంలోనే..చంద్రబాబు వ్యూహం ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.
``అన్ని జిల్లాల్లోనూ..యువత మాకు సపోర్టుగా ఉంది. డ్వాక్రా సంఘాలు, అంగన్‌వాడీ మహిళలు.. ఇతర ఉద్యోగులు కూడా మావెంటే ఉన్నారు.. మావల్లే వారికి ఏదైనా మంచి జరిగిందని.. భావిస్తున్నారు. ఈ సమయంలో వారిని మరింతగా మావైపు తిప్పుకోగలిగితే.. మా విజయాన్ని ఎవరూ ఆపలేరు. దీనికి మేం చేయాల్సింది చేస్తే చాలు. `` అని ఉభయ గోదావరి జిల్లాలకుచెందిన సీనియర్ నేతలు చెబుతున్నారు ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని మావైపు తిప్పుకోగలిగితే.. మాకు ఇక.. పొత్తులతో పనిలేదు.. అని వారు అంటున్నారు. మరి చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.