
ఇందులో వెయ్యి కిలోల గంజాయి, 97 కోట్ల రూపాయల విలువై 165 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. అదే సమయంలో తెలంగాణలో వెయ్యి కిలోల డ్రగ్స్ , మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నరని నివేదిక తెలిపింది. 17 వేల 394 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను కస్టమ్స్ విభాగం సీజ్ చేసినట్లు నివేదిక తెలిపింది. 20 వేల 64 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ ను రెవెన్యూ ఇంటిలిజన్స్ విభాగం సీజ్ చేసినట్లు నివేదిక తెలిపింది. వీటితోపాటు 13వందల 23 కోట్ల రూపాయల విలువైన బంగారం, విదేశీ నగదు స్వాధీనం చేసుకున్న నివేదిక తెలిపింది.
దేశవ్యాప్తంగా మెుత్తం 34 వేల కిలోల డ్రగ్స్ , మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు కేంద్రం విడుదల చేసిన నివేదిక తెలిపింది. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా విపక్షాలు రెచ్చిపోతున్నాయి. జగన్ సర్కారు రాష్ట్రాన్ని మత్తులో నింపుతోందని విమర్శిస్తున్నాయి. జగన్ సర్కారు ఉదాసీనత వల్లే ఇలా జరుగుతోందని.. వైసీపీ నేతలే గంజాయి దందాలు సాగిస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇక టీడీపీ నేతలైతే.. తమ నాయకుడు రాష్ట్రాన్ని హైటెక్ బాట పట్టిస్తే.. జగన్ మాత్రం కిక్కు బాట పట్టించారని విమర్శిస్తోంది. అయితే.. ఈ నివేదికను నిశితంగా పరిశీలిస్తే.. ఎక్కువ గంజాయి ఏపీలో దొరికినట్టు తెలుస్తోంది. మరి పట్టుబడింది అంటే ఆ మేరకు దాడులు బాగా జరిగినట్టే కదా.. గతంలో టీడీపీ సర్కారు గంజాయి దందాను ప్రోత్సహించిందని.. జగన్ సర్కారు వాటిని ఉపేక్షించకపోవడం వల్లే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని.. ఇది తమ పనితీరుకు నిదర్శనమని వైసీపీ నేతలు వాదిస్తున్నారు.