
జనసేన వారు మాత్రం 40, 50 కంటే ఏమాత్రం తక్కువ తీసుకునే ప్రసక్తే లేదని అంటున్నారు. ఇది సమస్య అయ్యేలా ఉంది. బలమైన సామాజిక వర్గం పవన్ కల్యాణ్ ది. తెలుగుదేశం ఆలోచన ఎలా ఉందంటే జనసేనకు ఎక్కువ స్థానాలు ఇస్తే అది ఓడిపోతుంది. దీని వల్ల నష్టపోయేది మనమే. చివరకు వైసీపీకి సాయం చేసినట్లు అవుతుందని టీడీపీ భావిస్తోంది. 2009 లో ఇలాగే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని 50 స్థానాలకు పైగా ఎమ్మెల్యే స్థానాల్లో టీడీపీ తప్పుకుని వారికి అప్పగిస్తే.. కేవలం పది స్థానాల్లోనే గెలిచారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారానికి దూరమైంది. అదే తప్పు మళ్లీ చేయకూడదని టీడీపీ భావిస్తోంది.
జనసేన వీరాభిమాని అయినా దీలీప్ సుంకర భావిస్తున్నదేమిటంటే 75 స్థానాలు ఇస్తేనే పోటీ. మళ్లీ 5 ఎంపీ స్థానాలు కూడా ఇవ్వాలని కోరుతున్నారు. అసలు విషయం ఏమిటంటే 75 స్థానాల్లో గెలిచే అభ్యర్థులు జన సేనకు ఉన్నారా? పోనీ పోటీలో నిలబడే సొంత నాయకులు అక్కడ ఎవరైనా ఉన్నారా.. వీళ్లు ముందుగా పోటీ చేసే అభ్యర్థులను ఎంచుకోవాలి. ఆ తర్వాత పొత్తులపై దృష్టి సారించాలి. అంతేకానీ ముందు నుంచే ఎక్కువ స్థానాలు కావాలనే పోటీ పడితే జనసేన, టీడీపీ పొత్తు మధ్యలోనే తెగిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.