
ఈసారి ఆ లక్ష్యం చేరాలన్నా, అధికారం నిలబెట్టుకోవాలన్న రాష్ట్రంలో సరికొత్త సమీకరణాలు కలిగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్, బీహార్ లో అనుసరిస్తున్నటువంటి ఫార్ములా ఇక్కడ కూడా పార్టీ అనుసరిస్తుంది అని తెలుస్తుంది. ఆ రెండు ఉత్తరాది రాష్ట్రాల్లో యాదవ ముస్లిం ఓటు బ్యాంకులకు గండి కొట్టి సమాజ్ వాది పార్టీ ఆర్జేడీలను దెబ్బతీసినట్టుగానే కర్ణాటకలో కూడా కాంగ్రెస్ అహిందా కూటమికి బిజెపి ఎసరు పెడుతుందని తెలుస్తుంది.
కర్ణాటకలో చాలా కాలంగా అహిందా కాంగ్రెస్ కి మద్దతుగా నిలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి దేవరాజ్ అరుసు హయాంలోనే చాలాకాలంగా అహిందా మైనారిటీ వెనుకబడిన దళితుల ప్రత్యేక సామాజిక వర్గాన్ని సృష్టించిన కాంగ్రెస్, సిద్ధ రామయ్య నాయకత్వంలో వాళ్లని తమ పార్టీ ఓటు బ్రాండ్ గా మల్చుకుంది. రాష్ట్ర జనాభాలో 17 శాతం దళితులు, 12 శాతం ముస్లింలు, 20 శాతం ఓబీసీలు, 7 శాతం కుడవలు కూడా కలిపి మొత్తం 49 శాతం సామాజిక వర్గం కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా రాష్ట్రంలో ఉంది.
కాంగ్రెస్ అన్ని ప్రాంతాల్లో బలంగా ఉండటానికి ఇదే ఒక కారణం. ఇప్పుడు మూలం పైన బిజెపి ప్రధానంగా దృష్టి సారించింది. అహిందా కూటమి నుండి కొన్ని వర్గాలను ఆకట్టుకుని కాంగ్రెస్ ని దెబ్బతీయాలని కమలనాధులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు బసవరాజు బొమ్మయ్ ప్రభుత్వం రాష్ట్ర రిజర్వేషన్లలో మార్పులు చేసిందని తెలుస్తోంది.