అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు కు అసలు పొత్తు అనే అంశాన్ని అధిష్టానం వద్దకు ఎవరైనా తీసుకెళితే ససేమిరా అంటూ క్షేత్రస్థాయి పరిస్థితులను వారికి రేవంత్ తెలియజేస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద ఆశా కిరణంలా మారింది. తెలుగు దేశం పార్టీ బీజేపీ ఆంధ్రలో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నాయి. దీనికి అసలు కారణం కాంగ్రెస్ ను ఎలాగైనా ఓడించాలనేది వారి అభిప్రాయం.
టీఆర్ఎస్ గెలిచినా పర్లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణలో కానీ దక్షిణాది రాష్ట్రాల్లో మళ్లీ పుంజుకోకూడదని బీజేపీ, టీడీపీల అభిమతం. ఇందుకనుగుణంగా ఉన్న పార్టీలను బీజేపీ కలుపుకొని పోయేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. అందుకే ఇన్ని రోజులు బీజేపీ అధిష్టానం అపాయింట్ మెంట్ చంద్రబాబుకు ఇవ్వలేదు. సడెన్ గా చంద్రబాబు తో అమిత్ షా, నడ్డా తదితరులు ఢిల్లీ లో భేటీకి కారణం ఎలాగైనా కాంగ్రెస్ ను గెలవనీయవద్దని చెప్పినట్లు సమాచారం.
2023 ఎన్నికల తర్వాత ఒక వేళ కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డిని పీసీసీ అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని కాంగ్రెస్ ఎలాగో సూచిస్తుంది. సీఎం కావాలనే ఆశతో కాంగ్రెస్ లో చేరినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను గనక గెలిపించుకోకపోతే కాంగ్రెస్ భవిష్యత్ తో పాటు రేవంత్ రెడ్డి భవిష్యత్తు కూడా తెలంగాణలో అంధకారమనే చెప్పొచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి