రాజకీయ నాయకులు పదవి వచ్చేవరకు ఒకలా ఉంటారు, పదవి వచ్చాక ఒకలా ఉంటారు అని అంటారు కొంతమంది. ఎలక్షన్ టైం లో  వాళ్ళు ఓట్ల కోసం అలవికాని హామీలు ఇస్తూ ఉంటారు. అదే మనుషులు ఒక్కసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత తాము ఎవరికైతే హామీ ఇచ్చారో ఆ ప్రజలను మర్చిపోతారు. అప్పుడు మర్చిపోవడమే తిరిగి మళ్లీ వాళ్లకి ప్రజలు గుర్తు రావాలంటే మల్లి ఎలక్షన్స్ ముందే గుర్తుకొస్తారు అని అంటున్నారు వాళ్లు.


ముఖ్యంగా గతంలో చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల టైంలో ఎడతెరిపి లేకుండా హామీలు ఇచ్చేయడం, గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలను సరిగా  నెరవేర్చక పోవడం చేయడం జరిగింది. ఈ సమస్య వల్లనే చంద్రబాబు నాయుడు గత ఎలక్షన్లో పరాజయం పాలయ్యాడని అంటూ ఉంటారు. చేస్తానని హామీలు ఇచ్చి చేయకపోవడం అనేది  చంద్రబాబుకు అదే పెద్ద మైనస్ అయ్యిందని చెప్పవచ్చు.


కానీ ఆయన పెన్షన్ విషయంలో ఏదైతే చెప్పారో అదే చేసారు. అన్నట్టుగానే ఆయన పెన్షన్ ను 1000రూపాయలు చేశారు.  ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2000 రూపాయలు పెన్షన్ అనే హామీ ఇవ్వగానే చంద్రబాబు  కూడా 2000 అని చెప్పడం జరిగింది. కానీ అప్పటికే ఎలక్షన్ల టైం దగ్గర పడిపోయింది. అలాగే జగన్మోహన్ రెడ్డి చేయలేనిది ఏవైనా ఉన్నాయంటే అది ఒకటి జాబ్ క్యాలెండర్, రెండవది అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అనే హామీలను నెరవేర్చలేకపోయారు జగన్. ఈ రెండు విషయాల్లో మైనస్ మార్క్స్ పడ్డాయి.


కానీ  వైయస్ వాహన మిత్ర పథకం కింద 275931 మందికి 10000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2019-20లో 236000మందికి, 2020-21లో 273000మందికి, 2021-22 లో 254000మందికి, 2022-23లో 261000మందికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ లెక్క అనేది 2023-24నాటికి  275930 మందికి  పెరిగిందని తెలుస్తుంది. ఇలా జగన్ ఐదేళ్లలో ఈ పథకాన్ని మాత్రం 100% నెరవేర్చాడని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: