ఉగ్రవాదంపై పోరాడేందుకు తమతో కలిసి రావాలని భారత్ ఇతర దేశాలను కోరుతోంది. కానీ కొన్ని దేశాలు ఉగ్రవాదులకు సహకరిస్తూనే ఉన్నాయి.  కెనడా ప్రభుత్వం ఖలీస్థానీ ఉగ్రవాదులకు సహకరిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. తాజాగా బ్రిటన్ లోను ఖలీస్థానీలు రెచ్చిపోతున్నారు. వీరికి బ్రిటన్ ప్రభుత్వం మద్దతు తెలుపుతోందనే విమర్శలు ఉన్నాయి. దీనిపై భారత్ తీవ్ర అభ్యతరం వ్యక్తం చేసింది.


స్కాట్లాండ్ లోని గ్లాస్గో లో గురు ద్వారా దగ్గర భారత దౌత్యవేత్తను సిక్కు ఆందోళన కారులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం బ్రిటన్ విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది. స్థానిక సిక్కు సమస్యలు, ఇతర వ్యవహారాలు గురించి చర్చించేందుకు విక్రమ్ దొరై స్వామిని గురుద్వారా వద్దకు ఆహ్వానించారని.. అయితే ఆయన అక్కడికి వెళ్లాక కింతమ ది ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చిందని హై కమిషన్ తెలిపింది.


కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య లో భారత ప్రమేయం ఉందని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన నేపథ్యంలో వివిధ దేశాల్లో సిక్కులు ఆందోళన చేస్తున్నారు.  బ్రిటన్ లో హై కమిషనర్ గా ఉన్న విక్రమ్ దొరైస్వామి స్కాట్లాండ్ లోని అనేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. అందులో భాగంగానే ఇది జరిగింది.  గ్లాస్గో లోని అల్బర్ట్ డ్రైవ్ ప్రాంతంలో ఆయన కారు ఆగగానే ముగ్గురు సిక్కు కార్యకర్తలు కారు దగ్గరికి  వచ్చి మీరు వెళ్లిపోవడం మంచిది అని చెప్పగానే ఆయన వెళ్లిపోయారు.


ఈ అంశాన్ని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని.. బ్రిటన్ ప్రభుత్వానికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.  ఇదంతా కావాలనే జరుగుతున్న కుట్రగా పలువురు అభిప్రాయపడుతున్నారు. సైన్యంలో కీలకంగా ఉన్న సిక్కులను రెచ్చగొట్టే చర్యగా అభివర్ణిస్తున్నారు. కానీ సైన్యంలోని సిక్కుల గానీ, ఇతర దేశాల్లోని సిక్కుల కూడా వీరి మాట వినడం లేదు. సిక్కులను మన నుంచి విడదేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఈ పరిణామాల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: