
ఏపీలో బీసీల తర్వాత రాజకీయంగా ప్రభావం చూపించేది కాపు సామాజిక వర్గం. కాపులు ఏపీలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజకీయంగా కాపుల హవా పెరిగిందన్నది వాస్తవం. 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినా టీడీపీ - బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చారు. నాడు కాపులు అందరూ టీడీపీ - బీజేపీకే సపోర్ట్ చేసి ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు. అయితే 2019 ఎన్నికలు వచ్చే సరికి జనసేన ఆ రెండు పార్టీలకు దూరం జరిగింది. ఒంటరిగా పోటీ చేసి ఘోరంగా ఓడిపోయింది. పవన్ భీమవరం , గాజువాక రెండు చోట్లా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన రాజులు ఒక్క సీటుతో మాత్రమే సరిపెట్టుకుంది.
ఇక గత ఎన్నికల్లో మళ్లీ టీడీపీ - బీజేపీ - జనసేన మూడు పార్టీలు జట్టు కట్టి విజయం సాధించాయి. వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యింది. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి గల కారణాలలో కాపులు పూర్తిగా దూరం కావడం. అందులోనూ జగన్ పదే పదే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారు. పవన్ వ్యక్తిగత .. వైవాహిక జీవితం గురించి ప్రస్తావించారు. ఇది కాపులకు అస్సలు నచ్చలేదు. అయితే ఈ సారి మాత్రం జగన్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని .. ఆచితూచి మాట్లాడాలని .. అసలు ఈ విషయాన్ని ఇకపై ప్రస్తావించ కూడదు అన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇది వ్యక్తిగతం గా తనకు .. అటు వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేసిందని.. ఈ పొరపాటు మళ్లీ చేయకూడదన్న నిర్ణయానికి జగన్ వచ్చేశారట.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు