
రాజకీయాలు అనేవి ఎన్నో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ ఉంటాయి. చంద్రబాబు అరెస్టు వ్యవహారం మంచి ఉదాహరణ. అప్పుడు జగన్ భావించినట్టు అది రాజకీయ లబ్దిని కలిగించలేదు సరికదా.. అది టీడీపీకి అనుకూలంగా మారిపోయింది. రెండు మూడు సామాజిక వర్గాలు ఏకమై టీడీపీకి అనుకూలంగా మారాయి. అంటే రాజకీయాల్లో ప్రతి చర్యకి వచ్చే కౌంటర్ పరిణామాలు అంచనా వేయడం ఎంత కష్టమో తెలుస్తోంది. ఇప్పుడు మళ్లీ జగన్ ఇలాంటి మరో సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాదులోని నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా, దాని వెనుక రాజకీయ పరిణామాలు జగన్‌ను తన ఆలోచన మార్చుకోనివ్వడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. సరస్వతీ పవర్ కంపెనీకి సంబంధించిన వాటాల వివాదం వ్యక్తిగతంగానే కాదు.. రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇక్కడ షర్మిల, విజయమ్మల పాత్రలు కీలకంగా మారాయి. తమకు రావాల్సిన వాటాను ఇవ్వలేదని.. జగన్ కుటుంబ ఆస్తులపై స్వాధీనత్వం చూపించారని షర్మిల వాదన తీవ్ర దుమారం రేపింది. ఫలితంగా మీడియాలో, రాజకీయ వర్గాల్లో జగన్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జగన్ సోదరిగా షర్మిల పార్టీ నేతగా ఉన్నా, ప్రస్తుతం ఆమె వైఖరి ప్రతిపక్షానికి అనుకూలంగా మారింది. ఇది రాజకీయ పరంగా జగన్‌కు మరింత ఇబ్బందికరంగా మారింది. ఇది పూర్తిగా వ్యక్తిగత, కుటుంబపరమైన వివాదంగా కనిపించినా, షర్మిల రాజకీయంగా క్రియాశీలంగా మారిన నేపథ్యంలో ఇది జగన్ రాజకీయ జీవితంపై బాగా ఎఫెక్ట్ చూపిస్తోంది.
కోర్టు తీర్పు జగన్‌కు ఆస్తుల పరంగా ఊరటనిచ్చినా రాజకీయంగా ఇది మరో చిక్కుముడిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షర్మిల భవిష్యత్తులో ఈ తీర్పును మరింతగా లేవనెత్తే అవకాశాలున్నాయి. జగన్ ఈ విషయంపై బలంగా స్పందించకపోతే, ప్రజలలోకి రాంగ్ ప్రచారం బాగా వెళ్లేలా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో ఎలాంటి వ్యూహంతో జగన్ ముందుకు సాగతారో, షర్మిల ఏ రీతిలో స్పందిస్తారో అనే విషయం రాజకీయంగా ఎంతో ఆసక్తికరంగా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు