బిహార్‌లో ఈ సారి ఆర్జేడీ - కాంగ్రెస్ కూట‌మికి గెలుపు అవ‌కాశాలు ఎలా ఉన్నాయ్ అనేదానిపై ఇప్ప‌టికే జాతీయ మీడియాల‌లో ర‌క‌ర‌కాల అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వెలువడిన స‌ర్వేలు చూస్తే ఎన్డీయే అడ్వాంటేజ్ క‌నిపిస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ఓపినియన్ పోల్స్ ప్రకారం ఎన్డీయేకు 48.9% ఓట్ షేర్ రాగా.. మ‌హాఘ‌ట్‌బంధ‌న్ కూట‌మికి కేవ‌లం 35.8% ఓట్ షేర్ క‌న‌ప‌డుతోంది. అయితే ముందుగానే ఆర్జేడీ లీడ‌ర్ తేజస్వీ యాద‌వ్‌ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ముందుగానే ప్ర‌క‌టిస్తే ఈ ఓట్ల శాతం గ‌ణ‌నీయంగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.


సీట్ - షేరింగ్ సమస్యలు - కాంగ్రెస్ పరిమిత పాత్ర :
ఎన్నిక‌ల వేళ ఆర్జేడీ - కాంగ్రెస్ మధ్య సీట్ల కేటాయింపు కూడా గెలుపు ఓట‌ముల‌ను ప్ర‌భావితం చేయ‌నుంది. ఆర్జేడీ గత ఎన్నికల పోలికలో ఎక్కువ సీట్లు అడుకుతోంది. అంటే సుమారుగా 135 - 140 వరకు సీట్లు కావాల‌ని ఆర్జేడీ నేత‌లు పంతం ప‌డుతున్నారు. కాంగ్రెస్‌కు కేవ‌లం 50–55 సీట్లు మాత్రమే ఇవ్వాలని ఆర్జేడీ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ 70 + సీట్లు డిమాండ్ చేస్తోంది. ఇది కూటమిలో అసंतృప్తికి కారణం అవుతోంది. కాంగ్రెస్ గ‌త ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తీసుకుని ఓడిపోవ‌డంతోనే ఈ కూట‌మి అధికారానికి దూర‌మైంది. ఈ సారి కాంగ్రెస్ త‌న‌ను తాను త‌గ్గించుకుంటే కూట‌మి విజ‌యం ఖాయ‌మ‌న్న లెక్క‌లు వినిపిస్తున్నాయి. లేక‌పోతే కాంగ్రెస్ ఆనాలోచిత నిర్ణ‌యాలు, సీట్ల అవసరం వాదనలు కూటమికి నష్టం చేకూర్చ‌నున్నాయి. ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో నిలిచే జ‌న్‌సురాజ్ పార్టీ కూడా పోటీలో ఉంటే.. అది ఎంత వ‌ర‌కు పోటీ ఇస్తుంది.. ఎవ‌రి ఓట్ల‌ను చీల్చుతుంది అన్న‌ది చెప్ప‌లేని ప‌రిస్థితి. ఏదేమైనా ఆర్జేడీ - కాంగ్రెస్ మ‌ధ్య సమ‌న్వ‌యం కుద‌రాల్సి ఉంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: