నేషనల్ ఫిజికల్ ల్యాబ్.. ఇది ఢిల్లీలో ఉంది. ఈ సీఎస్ఎఆర్-నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్పీఎల్) టెంపరరీ బేసిక్ మీద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం ఖాళీలు: 23 పోస్టులు ఉన్నాయి.

 

జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్), రిసెర్చ్ అసోసియేట్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఈ ఉద్యోగాలకు అర్హత ఆయా పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంబీఏ, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కూడా పరిగణలోకి తీసుకుంటారు.

 

మరో విశేషం ఏంటంటే.. అన్ని ఉద్యోగాలకూ రాత పరీక్ష, ఇంటర్వూలు ఉండవు. కొన్ని ఉద్యోగాలు నేరుగా ఇంటర్వ్యూల ద్వారానే అభ్యర్థిని పరిశీలించి ఉద్యోగ అవకాశం కల్పిస్తారు. అలాంటి వాటిలో నేషనల్ ఫిజికల్ ల్యాబ్ లో ఉద్యోగాలు ఒకటి.

 

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష ఏమీ ఉండదు. నేరుగా వాకిన్ ఇంటర్వ్యూకు వచ్చేయవచ్చు. వాక్ ఎప్పుడంటే.. జనవరి 20, 2020.. అంటే ఇంకా రెండు రోజులే ఉంది. త్వరపడండి..

వేదిక: సీఎస్ఐఆర్-ఎస్ ఎల్

డాక్టర్ కేఎస్, కృష్ణన్ మార్గ్, న్యూదిల్లీ-110012. మరిన్ని వివరాల కోసం http://www.nplindia.in/ వెబ్ సైట్ చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: