- ( ఎడ్యుకేష‌న్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తల్లికి వందనం పథకం యొక్క అప్డేట్

- ప్రారంభ తేదీ :- 12/06/2025 (స్కూల్స్ రీ ఓపెన్ చేసిన రోజు)
- లబ్ధిదారులు :- ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులు.
-  ఆర్థిక సహాయం :- ప్రతీ సంవత్సరం 15000/-
- కలిగే ప్రయోజనం :- తల్లులకు ఆర్థిక సహాయం మరియు పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు.


ఈ పథకానికి కావలసిన అర్హతలు :-
1. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయ్యి ఉండాలి
2. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారు అయి ఉండాలి, ఒకటవ తరగతి నుంచి 12 వ తరగతి వరకు అర్హులు, కనీసం 75% హాజరు కలిగి ఉండాలి.
3. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి
4. కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.
 

కావలసిన సర్టిఫికెట్స్ :-
1. విద్యార్థి స్టడీ సర్టిఫికెట్
2. తల్లి ఆధార్ కార్డు
3. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు
4. నివాస పత్రము లేదా రేషన్ కార్డ్
5. కుల ధ్రువీకరణ పత్రము
6. అవసరమైతే ఇన్కమ్ సర్టిఫికెట్
7. పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్.


ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించి , తల్లుల యొక్క ఎకౌంట్లో డబ్బులు జమ చేయనుంది.
తల్లికి వందనం రూ.15,000/- మీ అకౌంట్లో పడాలంటే
విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నెంబర్  తో పాటు NPCI జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలి.
ఒకవేళ లింక్ కానీ వారు లింక్ చేసుకొనుట కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లో లేదా  సచివాలయాలలో సంప్రదించండి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: