పసిడి ప్రియులకు ఇది మరో షాక్ అనే చెప్పాలి.. వరుసగా తగ్గుతూ వస్తున్న బంగారం ఈరోజు కూడా భారీగా తగ్గింది. పసిడి రేట్లు తగ్గడం ఇది ఎనిమిదోవ రోజు కావడం గమనార్హం. దీపావళి తర్వాత రేట్లు నెల చూపులు చూస్తున్నాయి. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు.. ఈరోజు రేట్లు భారీగా తగ్గడం తో బంగారం కొనాలనుకునే వాళ్ళు దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు.. ఎటూ చూసిన జనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు..



అంతర్జాతీయ మార్కెట్ రేటు ఎలా ఉన్నా హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రోజు రోజుకు కిందకు వస్తుంది.. ఈరోజు బంగారం విషయానికొస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పడిపోయింది. రూ.48,770కి క్షీణించింది. ఇకపోతే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.310 తగ్గుదల తోో  రూ.44,700కు పడిపోయింది.. ఇక వెండి కూడా అదే దారిలో పయనించింది.. గత కొన్ని రోజులు వెండి వస్తువులు తయారీ బాగా పెరగడంతో వెండికి డిమాండ్ కూడా పెరిగింది.



కానీ, ఇప్పుడు వెండి రేట్లు మాత్రం రోజు రోజుకు పడిపోతున్నాయి.. ఇకపోతే ఈ రోజు కిలో వెండి ధర పై రేటు భారీగా తగ్గింది.. ఏకంగా కిలో వెండి రూ.1,400 పతనమైంది. దీంతో వెండి ధర రూ.63,300కు క్షీణించింది. పరిశ్రమల నుండి యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ముఖ్య కారణమని చెప్పవచ్చు..భారతీయ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.04 శాతం తగ్గుదలతో 1782 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది.. వెండి కూడా అదే దారిలో నడిచింది.. ఇలా చూసుకుంటే బంగారం రేట్లు భారీగా తగ్గుతున్నాయని తెలుస్తుంది.. రాను రాను పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: