పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ఈ రోజు మార్కెట్ లో బంగారం ధరలకు బ్రేకులు పడ్డాయి. ఒక్కరోజులో ధరలు నేల చూపులు చూస్తున్నాయి. నిన్నటి ధర తో పోలిస్తే నేడు మార్కెట్ లో పసిడి ధరలు పతనమైయ్యాయి. మహిళలకు ఈ వార్త ఊరటను కలిగిస్తున్నాయి.. గత కొన్ని రోజులుగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి.. శుక్రవారం పసిడి ధరలు కిందకు దిగి రావడం తో జనాలు ఆభరణాలను కొనుగోలు చేసెందుకు దుకాణాల వద్ద బారులు తీరారు.


బంగారం ధరలు తగ్గితే .. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.. హైదరాబాద్ మార్కెట్ లో నేడు పసిడి ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పై రూ . 540 తగ్గింది.  దీంతో 10 గ్రాముల ధర రూ.48,930 కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర పై రూ. 500 తగ్గుముఖం పట్టింది. దాంతో నేడు 22 క్యారెట్ల ధర  రూ.44,850కు పడిపోయింది. బంగార ధరలు తగ్గితే .. వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.


హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధర కిలో కు రూ. 1100 పడిపోయింది. దీంతో మార్కెట్ లో కేజీ వెండి ధర రూ. 75,100 కు దిగొచ్చింది. పెళ్లిళ్ల సీజన్ కాబట్టి వెండి వస్తువులు కొనుగోలు చేయాలని భావించేవారికి  ఇది సరైన సమయం. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పసిడి ధరల కు బ్రేకులు పడ్డాయి. గత కొద్దీ రోజులు గా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. పసిడి రేటు ఔన్స్‌కు 1779 డాలర్లు ఉండగా, వెండి 26. 51 డాలర్ల వద్ద కొనసాగుతుంది. గంట గంటకు మారే ఈ గోల్డ్ రేట్లు మరి రేపు ఎలా ఉంటాయో చూడాలి..ఏది ఏమైనా జులై లో బంగారం భారీగా తగ్గుతుందనే వార్త వినిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: