ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...తలనొప్పి తో బాధ పడుతున్నారా.. బాగా వేధిస్తోందా..? అయితే ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ పద్ధతులు పాటించండి.తలనొప్పి వేదిస్తుంటే.. ప్రతిరోజు క్రమం తప్పకుండా కొబ్బరినూనె రాసుకోండి.మసాజ్ చేసుకోండి. కొబ్బరి నూనె తలలో వుండే వేడిని పీల్చుకుంటుంది. అందువల్ల తల హీట్ ఎక్కకుండా ఉంటుంది.ఎక్కువ మొబైల్స్ వాడకండి. వాడినా కాని బ్రైట్ నెస్ తగ్గించి వాడితే చాలా బెటర్..వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ట్రై చెయ్యండి. చల్లటి వాతావరణంలో జీవించండి..కనుబొమ్మల మధ్య ఖాళీలో 45 సెకన్లు నొక్కి పట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. దీని వల్ల నరాలు ఉత్తేజితమై ఎనర్జీ వస్తుంది. రిలాక్స్‌గా అనిపిస్తుంది. ఇది కేవలం తలనొప్పి వచ్చినప్పుడే కాదు.. రోజుకు ఒకసారి చేసినా మంచిదే. దీనివల్ల కంటి నొప్పులు ఉండవు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సైనస్ సమస్య దూరమవుతుంది. మన అరచేతిలో చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రెజర్ పాయింట్స్‌లో సుతారంగా నొక్కాలి. దీనివల్ల ప్రెజర్ పాయింట్స్ ఉత్తేజితమై నిమిషాల్లో తలనొప్పి మాయమవుతుంది.


రోజు యోగ, వ్యాయామం క్రమం తప్పకుండా చెయ్యండి.. ఈ ప్రక్రియతో భావోద్వేగాలను కూడా అదుపులో ఉంచవచ్చు. డీ హైడ్రేషన్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. కాబట్టి గ్లాసు చల్లని నీళ్లు తాగండి. దీనివల్ల వల్ల తలనొప్పి తగ్గే అవకాశం ఉంది. ధ్యానం చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది.మనం తీసుకునే ఆహారంతో కూడా తలనొప్పిని అదుపు చేయొచ్చు. ఆరెంజ్ జ్యూస్ లేదా పాలు వంటివి తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి కండరాలపై ఒత్తిడ తగ్గుతుంది. ఫలితంగా తలనొప్పి మాయమవుతుంది. తలనొప్పి వస్తున్నప్పుడు తలపై స్నానం చేయకూడదని అంటారు. అయితే, ఆ సమయంలో చల్లని నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే ఫలితం ఉంటుంది. వేడి నీటితో తల స్నానం చేయడం వల్ల ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.ఒత్తిడిగా వున్నప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. అలాంటప్పుడు చిన్న పిల్లలతో ఆడుకోండి. అలాగే భార్యతో టైం ఎక్కువ స్పెండ్ చెయ్యండి. ఈ పద్ధతులు లైఫ్ లాంగ్ పాటించడం వలన తలనొప్పి సమస్య రాదు.ఇలాంటి మరెన్నో ఆరోగ్యాకరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: