బూడిద గుమ్మడి కాయ ని మనం తరచుగా ఇంటిముందు వేలాడదీసి ఉండటాన్ని చూస్తూ ఉంటాం.    నరదిష్టి తగలకుండా గుమ్మానికి బూడిద గుమ్మడికాయ నీ వేలాడదీయడం మన భారతీయ సాంప్రదాయం. బూడిద గుమ్మడి కాయ లోని ఔషధ గుణాల గురించి చాలా మందికి తెలియదు. మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి. అందుకే దీన్ని భారతీయ ఆయుర్వేదంలో  'వైద్య కుష్మాండం' అని 'వైద్య కంబళం' అని పేర్కొన్నారు.

బూడిద గుమ్మడి కాయతో ఎన్నో రకాల రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. ముఖ్యంగా గుమ్మడి హల్వా రుచికరంగా ఉంటుంది. ఇంకా గుమ్మడి వడియాలు చాలా ప్రాచుర్యం పొందాయి.బూడిద గుమ్మడి కాయలోనూ, విత్తనాల్లోనూ, తీగలోనూ కూడా ఔషధ గుణాలున్నాయని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంతటి విశిష్టమైన ఔషధగుణాలున్న బూడిద గుమ్మడి కాయను ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం!.

బూడిదగుమ్మడి కాయలులో కార్బొహైడ్రేట్లు, కొవ్వు శాతం తక్కువగా ఉండటంతో డైటింగ్‌ చేసే వారికి మంచి ఆహారము చెప్పవచ్చు.

బూడిదగుమ్మడి కాయలో విటమిన్ సి, బి అధికంగా ఉండటంతో మన శరీరానికి అవసరమైన వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకపాత్ర వహిస్తుంది.

బూడిద గుమ్మడి విత్తనాల నుంచి తీసిన నూనెని చర్మవ్యాధుల నివారణలో సమర్థవంతంగా పనిచేస్తుంది.

బూడిదగుమ్మడి లో ఉండే  ఫైబర్ జీర్ణక్రియను క్రమబద్దం చేసి మలబద్దకాన్ని నివారిస్తుంది

ప్రతి రోజు గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల మన శరీరం చల్లబడటం తో పాటు, అధిక రక్తపోటు సమస్య నుంచి దూరం చేస్తుంది.
 
 బూడిద గుమ్మడి తీగ రసాన్ని హై బిపి, నిద్రలేమితో బాధపడేవారికి ఇస్తే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది

బూడిద గుమ్మడి గింజలను కొబ్బరి నునెలో మరిగించి ఆ మిశ్రమాన్ని తలవెంట్రుకులకు రాస్తే జుట్టు ఆరోగ్యంగా మృదువుగా ఉంటుంది.

గుమ్మడి కాయ జ్యూస్ లో తేనె కలుపుకొని ప్రతిరోజు సేవిస్తే నిద్రలేమి సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: