

ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో ఆటిజం థెరపీ కేంద్రాన్ని ఏర్పా టు చేసిన సందర్భంగా పినాకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ వ్యవస్థాపకురాలు , ముఖ్య వ్యూహకర్త డాక్టర్ శ్రీజారెడ్డి మాట్లాడారు. వైజాగ్ లో ఆటిజం థెరపీ కేంద్రాన్ని ఏర్పా టు చేసినందుకు ఆనందంగా ఉంది.. ప్రజల నుంచి వచ్చిన మద్దతు మర్చిపోలేనిది. ఆటిస్టిక్ వల్ల ఇబ్బందులు పడుతున్న వారి జీవితాలను మెరుగుపరిచేందుకు ఇదొక మంచి అవకాశం.. పిన్నకిల్ బ్లూమ్స్ నెట్వర్క్ ఆటిస్టిక్ వ్యక్తులకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందిస్తామని గర్వంగా చెప్తున్నారు. న్యూరోడైవర్సిటీని ప్రోత్సహించడానికి బహుళ-క్రమశిక్షణా బృందాన్ని, బహుళ-సెన్సోరియల్ వాతావరణాన్ని అందిస్తున్నాము.. సంవత్సరాల పరిశోధనల ఫలితం, దశాబ్దాల అంతర్జాతీయ విజ్ఞానం కలిపి 'MIRRACLE by PINNACLE' 360 డిగ్రీ పేటెండెడ్ డిజిటల్ ప్రోగ్రాం ద్వారా చిన్నారుల రుగ్మతల నుండి కాపాడేందుకు వరల్డ్ క్లాస్ చికిత్సను అలాగే మెరుగైన శాస్ర సాంకేతిక రిహాబిటేషన్ కేంద్రాన్ని నెలకొల్పడం నిజంగా ఎంతో మంది తల్లిదండ్రులకు వరం.

ఇప్పటికే పినాకిల్ హైదరాబాద్ సంస్థ ద్వారా మల్టీడిసిప్లిన్, మల్టీసెన్సరీ, ఇంటిగ్రేటెడ్, ఎక్స్క్లూజివ్ 1: 1, అర్హత కలిగిన బృందంచే 6,00000 కు పైగా తెరపీలను చేసి 95 % సంతృప్తిని తల్లిదండ్రులకు వారి మొహాల్లో చిరు నవ్వులను పంచింది. 104 సంవత్సరాల క్రితమే ఈ ఆటిజం అనే రుగ్మత వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పుడు జీవితకాల రుగ్మతగా స్థిరపడిపోయింది.. ప్రస్తుతం అంటే 2021 లో ప్రతి యాభై మందిలో ఒక చిన్నారి ఈ రుగ్మత తో బాధపడుతున్నారు. దీన్ని అధిగమించాలంటే పినాకిల్ బ్లూమ్ నెట్వర్క్స్ వారి ఆటిజం థెరపీ సెంటర్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.