ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది.దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు వున్నాయి.ఇక ఉల్లిపాయల్లో ఉండే క్వెర్సెటిన్ (quercetin) అనేది ఉంటుంది. ఇది శరీరానికి చాలా మేలు చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఇది సహాయపడుతుంది. ఇక కెర్సెటిన్ కడుపులో మంటను తగ్గించడానికి, అలెర్జీ లక్షణాలను తగ్గించడానికి, రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఒక పచ్చి ఉల్లిపాయను రోజు భోజనంతోపాటు తీసుకోవడం వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుందని ఓ అధ్యయనంలో వెళ్లడయింది.

ఇక ఉల్లిపాయల్లో క్వెర్సెటిన్ మాత్రమే కాకుండా  విటమిన్ సి, బి, పొటాషియం కూడా ఉంటాయి. ఇక ఇందులో వుండే పొటాషియం రక్తపోటు సమస్యతో బాధపడుతున్నవారికి చాలా మంచిది. ఇక అధిక యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ అనే గుణాలు కూడా ఉల్లిపాయలో చాలా పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. ఉల్లిపాయలు ఒక మంచి యాంటీ బాక్టీరియల్‌గా కూడా పనిచేస్తుంది.ఇక  అలాగే పలు అధ్యయనాల ప్రకారం, షుగర్ వ్యాధి (మధుమేహం), ప్రీ-డయాబెటిస్ బాధితుల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఉల్లిపాయలు సహాయపడతాయి. అలాగే మీరు తీవ్రమైన ఎసిడిటీ లేదా "మీకు తీవ్రమైన ఆమ్లత్వం లేదా GERD (Gastroesophageal reflux disease) సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటే మాత్రం ఉడికించిన ఉల్లిపాయను తీసుకోవడం చాలా మంచిదని వెళ్లడయ్యింది.

ఇక ఉల్లిపాయను రోజు భోజనంలో తరచుగా తీసుకోవడం వల్ల మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు అనేవి పూర్తిగా తగ్గుతాయి.అలాగే ఉల్లిపాయ అనేది పూర్తిగా క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటుంది.

ఉల్లిపాయలో విటమిన్-C, విటమిన్ B6 లతో పాటు ఇంకా కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం, మాంగనీస్, పాస్ఫరసర్ అనేవి ఉంటాయి.ఇక ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను బాగా మెరుగు పరుస్తుంది.అలాగే ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్లు కూడా బ్లడ్ షుగర్‌ను తగ్గిస్తాయి.ఇంకా మూత్రశయ ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి ఉల్లిపాయ అనేది మంచి ఔషదం.

ఈ విధంగా ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి తప్పకుండ రోజు ఉల్లిపాయని అన్నంలో తినండి.

మరింత సమాచారం తెలుసుకోండి: