
జొన్నలు:
మనకు కాల్షియం, ప్రొటీన్, పీచుపదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండెజబ్బుల్ని దూరం చేయడంతో పాటు నరాల బలహీనత, మానసిక రుగ్మత , నోటి పుండ్లు వంటి సమస్యల నుంచి కాపాడుతాయి. కాబట్టి జొన్నలతో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోవాలి.
సబ్జా గింజలు:
సబ్జా గింజలు నానబెట్టిన ఆ నీటిని తాగడం వల్ల దాహం తీర్చడమే కాదు జ్వరం, తలనొప్పి ,దగ్గు , ఆస్తమా వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. శరీరంలోని కొవ్వును తగ్గించడంలో .. అజీర్తి సమస్యను దూరం చేయడంలో చక్కగా పనిచేస్తాయి. సబ్జా గింజలు లో మనకు ఇనుము, మాంసకృత్తులు, కొవ్వుపదార్థాలు క్యాల్షియం, పాస్పరస్, రైబోఫ్లేవిన్ వంటి పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.
కొర్రలు :
ఊబకాయంతో బాధపడేవారు అలాగే డయాబెటిస్ తో బాధపడే వారికి కూడా కొర్రలు మంచి ఔషదంగా చెప్పవచ్చు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి .ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా బరువు తగ్గడమే కాదు.. రక్తస్రావం, కీళ్లవాతం, గుండె సమస్యలు కూడా దూరమవుతాయి.
సాములు:
వీటిలో ప్రోటీన్లు , ఫైబర్, మినరల్స్, కాల్షియం అధికంగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన అదనపు శక్తి లభిస్తుంది. మైగ్రేన్ సమస్య దూరమవుతుంది.
రాగులు:
బి కాంప్లెక్స్ అధికం గా ఉండే వీటిని తినడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు ఎముకలు, నరాలు , కండరాలు బలంగా మారుతాయి. కాల్షియం అధికంగా లభించడం వల్ల పలు రోగాలు కూడా దూరమవుతాయి.
వీటితోపాటు అరికెలు, అవిసేలు వంటివి తీసుకోవడం ఉత్తమం.