కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెరిగిపోయింది అనే విషయం తెలిసిందే. ఒకప్పుడు ఉరుకుల పరుగుల జీవితం లో డబ్బులు సంపాదించాలని కోరుకునే వారు అందరూ. కానీ ఇప్పుడు మాత్రం డబ్బు లేకపోయినా పర్వాలేదు కానీ ఆరోగ్యంగా ఉంటే చాలు హాయిగా బ్రతకవచ్చు అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి ఎన్నో రకాల చిట్కాలు పాటిస్తూ ఉన్నారు వైద్యులు. ఏది చెబితే అది తినడానికి కూడా సిద్ధమైపోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని రకాల కూరగాయలను క్రమం తప్పకుండా తీసుకుంటున్నారు చాలామంది జనాలు.


 ఇక ఇలా ప్రతి ఒక్కరు ఇష్టపడే కూరగాయలలో అటు చిక్కుడుకాయ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది చిక్కుడు కాయ కర్రీ తినడానికి ఇష్టపడుతుంటారు. ఇక పల్లెటూర్లకీ వెళ్తే మార్కెట్ లోకి వెళ్లి చిక్కుడుకాయ తీసుకోవడం కాదు ప్రతి ఇంటి ముందు కూడా చిక్కుడుకాయ  చెట్టు ఉంటుంది. ఏకంగా ఇంటి ముందు పండించిన చిక్కుడుకాయను కూరగా వండుకొని తింటుంటారు.  అయితే చిక్కుడుకాయ లో ఎలాంటి పోషకాలు ఉంటాయి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే చిక్కుడు కాయ తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి అంటూ చెబుతున్నారు నిపుణులు.



 చిక్కుడు కాయ కర్రీ తినడం వల్ల అది చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది అంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు.  అంతేకాకుండా నిద్రలేమి ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది అంటూ చెబుతూ ఉండటం గమనార్హం. అయితే సాధారణంగా ఎంతో మంది మహిళలు రక్తహీనతతో బాధ పడుతూ ఉంటారు. ఇక అలాంటి వారు క్రమం తప్పకుండా చిక్కుడు కాయ కర్రీ తినడం వల్ల ఇది ఒక మంచి ఔషధంగా పని చేస్తుంది అంటూ చెబుతున్నారు నిపుణులు. అంతేకాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అంటూ ఉన్నారు. ఇక మెదడు పనితీరును కూడా చిక్కుడుకాయ మెరుగుపరుస్తుందట..

మరింత సమాచారం తెలుసుకోండి: