చెవి నొప్పి అనేది ఎంత తీవ్రమైన బాధ కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ చెవి నొప్పి ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో ఎక్కువ మందిని వేధిస్తుంటుంది. చెవి నొప్పి రావడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి.అయితే చెవిలో ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా చెవి నొప్పి బాధిస్తుంది. వర్షంలో తడటం వల్ల కూడా తీవ్రమైన చెవి నొప్పి, చెవులు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. జలుబు, గొంతు నొప్పి, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా చెవి నొప్పికి దారి తీస్తుంది. మీరు కూడా ఇలాంటి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటే వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఈ టిప్స్ పాటిస్తే చాలు. వీటిని పాటించడం వల్ల వర్షాకాలంలో ఇబ్బంది పెట్టె చెవి సమస్యను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.ఇక చెవి నొప్పిని తగ్గించడంలో ఉప్పు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో ఉప్పు వేసి గోరువెచ్చగా వేయించి, ఒక మెత్తటి కర్చీఫ్‌ లాంటి బట్టలో వేసి మూటకట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు మూటతో నొప్పి ఉన్న చెవి చుట్టూ కాపడం పెట్టుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


తులసి ఆకుల రసాన్ని చెవిలో వేస్తే క్షణాల్లో నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.చెవులను ఎప్పుడు పొడిగా ఉంచుకోవాలి. తడి తగలకుండా, చలిగాలి చెవుల్లోకి చేరకుండా జాగ్రత్త తీసుకోవాలి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే, వెంటనే తగ్గిపోయేలా వైద్య సలహాలు పాటించాలి. వైద్యులు సూచించిన మేరకు తగిన మందులు వాడుతూ, గొంతును జాగ్రత్తగా చూసుకోవాలి. చెవులు మృదువైన కాటన్ తో తుడవకూడదు. ఇక,ప్రస్తుతం ఇయర్‌ ఫోన్స్‌ అలవాటు ఎక్కువగా ఉంది. చెవుల్లో ఎప్పుడూ ఇయర్‌ఫోన్‌లు పెట్టుకోవడం మంచిది కాదు..అలాగే ఇతరులు ఉపయోగించే ఇయర్‌ఫోన్‌లను మీరు ఉపయోగించకుండా ఉంటే మంచిది.ఇయర్ బడ్స్ వాడటం మానేయాలి. ఇయర్ బడ్స్ చెవిలో ఇన్ ఫెక్షన్ని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఇయర్‌ఫోన్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: