ఈ శీతాకాలంలో కీళ్ల నొప్పుల, ఇతర నొప్పులు పెరగటం సర్వసాధారణం. నిద్రలో పిక్కలు పట్టేయడం, నిద్ర లేచిన వెంటనే నడవనీయకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని చిట్కాలను పాటించడం వల్ల, వీటి నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తూ ఉంటారు. చిట్కాలు అంటే ఇప్పుడు చూద్దాం..

 వయసు మీద పడేకొద్దీ కీళ్ళనొప్పులు,నడుము నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ ఇవి చలికాలంలో మరింత తీవ్రతమై ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి.
 అలాంటి వారు ఈ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

 1).గోరువెచ్చని నీటితో స్నానం చేయడం..
చలి కాలంలో కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు, గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల,శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరి ఆర్థరైటిస్ సమస్యలు సులభంగా తగ్గేలా చేస్తుంది.చలి కాలంలో కీళ్ల నొప్పుల సమస్య ఉన్నవారు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.


2).విటమిన్ డి గల ఆహారాలు తినాల్సి ఉంటుంది:
 కీళ్ల నొప్పులు నడుము నొప్పులు తగ్గించడానికి బోన్ డెన్సిటీ పెంచుకోవాల్సి ఉంటుంది. దానికోసం విటమిన్ డి కల ఆహారాలైన పెరుగు పాలు చేపలు గుడ్లు తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల, విటమిన్ డి పుష్కలంగా అంది, క్యాల్షియం ఉత్పత్తి పెరిగి,నొప్పులను నివారిస్తుంది


3).శరీరాన్ని వేడిగా ఉంచుకోవడం..
కీళ్ళ సమస్యలతో ఇబ్బంది పడేవారు,శరీరానికి వెచ్చదనం అందించాల్సి ఉంటుంది. శరీరం వెచ్చగా ఉంటేనే కీళ్ల నొప్పుల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.


4).చల్లదనాన్ని నిరోధించాలి..
కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు  తప్పకుండా తెల్లదనాన్ని నిరోధించే దుస్తులను వేసుకోవాలి. అరచేతి, మోకాళ్లను ఉలెన్ వస్త్రాలతో తో కప్పి ఉంచడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇలా చేస్తేనే కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. మరియు రోజు రెండు మూడు సార్లు అల్లం కషాయం ను తాగడం వల్ల  రోగనిరోధక శక్తి పెరిగి, సీజనల్గా వచ్చే ఎలాంటి రోగాలునైనా నివారిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: