దీంతో ఒకప్పుడు చికిత్స లేని వ్యాధులకు సైతం ఇప్పుడు అధునాతనమైన చికిత్స చేసి నయం చేయగలుగుతున్నారు వైద్యులు. అదే సమయం లో ఇక ప్రతి చిన్న సమస్యకి నేటి రోజుల్లో డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే టెక్నాలజీ తో కూడిన కొన్ని పరికరాలు అందుబాటు లోకి వచ్చిన నేపథ్యం లో.. ఇక ఇంట్లోనే కూర్చుని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను సొంతంగా చికిత్స చేసుకోగలుగుతున్నారు. అయితే మొన్నటి వరకు ఇక జ్వరం తీవ్రత ఎంత ఉంది అని గుర్తించేందుకు ధర్మా మీటర్ వాడేవారు.
కానీ ఇప్పుడు థర్మామీటర్ అవసరం లేదు. ఏకంగా స్మార్ట్ ఫోన్ తోనే జ్వరం తీవ్రతను గుర్తించేందుకు అవకాశం ఉంది. వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్ర వేత్తలు ఫీవర్ యాప్ పేరుతో కొత్త యాప్ ని రూపొందించారు. ఇక ఈ యాప్ బాడీ టెంపరేచర్ను కొలిచేందుకు మీ ఫోన్ ను థర్మామీటర్గా మార్చేస్తుంది. ఫోన్లో ఉన్న టచ్ స్క్రీన్ సెన్సార్ల సహాయం తో బాడీ టెంపరేచర్ను కొలుస్తుంది. ఇందుకోసం యాప్ ఓపెన్ చేసి కెమెరా ఆన్ చేసి ఇక కెమెరా లెన్స్ ను వ్యక్తి నుదుటిపై 90 సెకండ్ల పాటు ఉంచాలి. కాగా ప్రస్తుతం ఈ యాప్ టెస్టింగ్ దశ లో ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి