దగ్గుతో బాధపడే వారు నీటిలో తులసి ఆకులు వేసి మరిగించాలి. తరువాత ఈ నీటిని వడకట్టి అందులో తేనె వేసి కలిపి తీసుకోవాలి. దగ్గు, కఫాన్ని తగ్గించడంలో తులసి ఆకుల టీ చక్కగా పని చేస్తుంది. వెల్లుల్లి రెమ్మలను నోటిలో వేసుకుని నమలడం అలాగే వెల్లుల్లిని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తీసుకోవడం వల్ల దగ్గు సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.వెల్లుల్లిలో ఉండే యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఇన్పెక్షన్ ను తగ్గించడంలో మనకు సహాయపడతాయి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు తల కింద ఎత్తైన తలగడను ఉంచి నిద్రపోవాలి. లేదా తలవైపు మంచం ఎత్తుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాత్రిపూట దగ్గు రాకుండా ఉంటుంది. అలాగే దగ్గు, ఛాతిలో అసౌకర్యం, కఫం వంటి సమస్యలతో బాధపడే వారు వేడిపాలల్లో పసుపు కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల పసుపులో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడే వారు అల్లం టీని తీసుకోవడం మంచిది. నీటిలో అల్లం ముక్కలు వేసి మరిగించి తీసుకోవాలి.


అల్లంలో ఉండే యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు దగ్గు, ఛాతిలో, గొంతులో అసౌకర్యం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. దగ్గు, కఫం వంటి సమస్యలతో బాధపడే వారు వేడి నీటిలో యూకలిప్టస్ నూనెను వేసి ఆవిరి పీల్చాలి. ఇలా చేయడం వల్ల దగ్గు, కఫం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది. దగ్గు, గొంతుమంట వంటి వాటితో బాధపడే వారు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి కలపాలి. ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించాలి. రోజుకు 4 నుండి 5 సార్లు ఇలా చేయడం వల్ల గొంతు మంట, నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.దగ్గుతో బాధపడే వారు గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసాన్ని సమానంగా వేసి కలిపి తీసుకోవాలి.ఇలా తీసుకోవడం వల్ల ఛాతిలో పేరుకుపోయిన శ్లేష్మం తొలగిపోతుంది.ఇటువంటి సమస్యలకు చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. మందులకు బదులుగా ఇంటి చిట్కాలను వాడడం వల్ల ఈ సమస్యల నుండి చక్కటి పరిష్కారం లభిస్తుంది. అలాగే ఈ చిట్కాలను వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: