ప్రపంచవ్యాప్తంగా జనం ఇష్టంగా తీసుకునే రాక్ సాల్ట్ ది కూడా అదే కథా. ఈ పింక్ కలర్ కొండ ఉప్పును  ఓ గుర్రం కనిపెట్టిందట. అది కూడా ది  మోస్ట్ ఎంపేరర్ అలెగ్జాండర్ ది గ్రేట్ గుర్రం ఈ విషయాన్ని కనిపెట్టిందని చెప్తారు.అంటే ఆ ఒక్క గుర్రమే ఏవేవో పరిశోధనలు చేసి కనిపెట్టిందని కాదు, కానీ ఆ గుర్రం ఆ సమయంలో  ఆ భూమిలో ఉండే రాక్ సాల్ట్ రాళ్లను అదే పనిగా నాకుతూ ఉండడం గమనించిన అలెగ్జాండర్ అంతెందుకు అలా చేస్తుంది అన్న విషయంపై ఆసక్తి చూపించారు. నిజానికి ఆ ఒక్క గుర్రమే కాదు సాధారణంగా ఆ ప్రాంతంలో గుర్రాలు పింకు కలర్ బండరాళ్లను టెస్ట్ చేయడం జరుగుతోంది. చక్రవర్తి దృష్టి పడింది కాబట్టి ఆ రాయి గురించి పరిశోధించారు ఆయన అనుచరులు. చివరకు అది ఒక ఉప్పు గా గుర్తించారు. ఆనాడు అలెగ్జాండర్ గుర్రం కనిపెట్టిన పదార్థం ఇప్పుడు వందల కోట్ల వ్యాపారానికి నాంది పలికింది. ఆ పదార్థం ఇప్పుడు అమేజింగ్ బిజినెస్ గా మారింది. పాకిస్తాన్ మీదుగా భారత దేశానికి,ఇక్కడి నుంచి ప్రపంచ మంతటికీ విస్తరిస్తోంది. ఆరోగ్యాన్ని అందించడంతో పాటు ఆకర్షణీయమైన వస్తువులకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.

 ప్రపంచంలో చాలా అరుదుగా దొరికే ఈ ఉప్పు ఒకప్పుడు అఖండ భారత్ లో భాగంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన సమయంలో జరిగిన దేశ విభజన తర్వాత ఆ ప్రాంతం పాకిస్తాన్ దేశం లోకి వెళ్లి పోయింది. ఇప్పుడు మళ్లీ పాక్ నుంచి భారత్ కు చేరుకొని ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి అవుతోంది. వరస దండయాత్రలతో ఎందరో రాజులను ఓడించి ప్రపంచాన్ని తన పాదాక్రాంతం చేసుకున్న అలెగ్జాండర్  ది గ్రేట్ మనదేశం పైన కూడా దృష్టి పెట్టి దండెత్తి వచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హిమాలయన్ బ్రాండ్ పేరుతో రాక్ సాల్ట్ ను అమ్మడం మొదలైంది. అమెజాన్ వేదికగా 2009లో ఇంగ్లాండులో అమ్మకానికి ఉంచారు. రుచితోపాటు ఆరోగ్యం లక్షణాలు పుష్కలంగా ఉండటం, మార్కెటింగ్ టెక్నిక్  తోడవడంతో ఉప్పు కి  ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇంగ్లాండ్ నుంచి క్రమంగా యూరప్, అమెరికా, ఏసియా  దేశాలకు విస్తరించింది. మన దగ్గర తొమ్మిది వందల గ్రాముల ఉప్పు ప్యాకెట్ ధర క్వాలిటీ ని బట్టి  80 రూపాయల నుంచి 200 రూపాయలు గా ఉంది. అదే సాధారణ ఉప్పు ఎంత మంచి క్వాలిటీ అయినా 20 నుంచి 30 రూపాయల లోపే ఉంటుంది. నిజానికి ఉప్పు అంటే సోడియం అనే అపోహలు ఉన్నాయి. అయితే అన్ని రకాల ఉప్పులో సోడియం ఉంటుంది, అయితే ఉప్పు స్పటికాల లో సోడియం  ది ఒక భాగం మాత్రమే. మనం ఇంట్లో ఉపయోగించే సాధారణ టేబుల్ సాల్ట్ లో  సోడియం క్లోరైడ్ ఉంటుంది.

 ఎందుకంటే ఈ రెండు మూలకాలు శరీర ఆరోగ్యానికి అవసరం. అయితే సైంధవ లవణం లో మాత్రం ఉప్పులో సోడియం తో పాటు జింక్, నిఖిల్, కోబాల్ట్, మ్యాంగనీస్, కాపర్ మినరల్స్ కూడా ఉంటాయి. ఇవి ఉండడం వల్లనే ఆ ఉప్పుకు అలాంటి రంగు ఏర్పడింది. మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హాని చేస్తుంది. కానీ తక్కువయితే కూడా అదే హాని జరుగుతుంది అతి తక్కువ సోడియం తీసుకోవడం వల్ల నిద్రలేమి, మెంటల్ ప్రాబ్లమ్స్, కోమాలోకి వెళ్ళడం, ఫిట్స్, మూర్చలు కలిగి మరణం సంభవించే అవకాశం కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: