చిన్నపిల్లల విషయం లో అందరు చాల జాగ్రత్తలు తీసుకుంటారు కారణం వారికీ ఏది కావాలన్నా మాటలు వచ్చే వరకు అడగలేరు. వాళ్ళకి ఆకలివేసినపుడు ఏడుస్తారు. తల్లి పిల్లల ఆకలిని గమనించి పాలు పడుతుంది. కానీ కొంతమంది దగ్గర బిడ్డకు సరిపడా పాలు లేక డబ్బా పాలు పడతారు. మరి అలంటి పిల్లల పాల బాటిల్స్ ను ఎలా శుభ్రం  చేయాలి, ఎలా వాడాలి అనే  విషయాలు ముందుగా తెలుసుకోవాలి లేదంటే పిల్లలు  అనారోగ్యాల పలు అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు తొందరగా రోగాల బారిన పడుతూ ఉంటారు బాటిల్‌తో పాలు పట్టించడంలో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఇంట్లో ఉన్న ఎవరైనా ఆ పని చేయొచ్చు. తల్లే అవసరం లేదు. 

 

 


అయితే, ఇందులో ఓ పని కూడా చేయాలి అదే ఆ బాటిల్ ని క్లీన్ చేసి స్టెరిలైజ్ చేయడం.తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన తరువాత బయట వాతావరణానికి అలవాటు పడడానికి బేబీకి కొంత సమయంపడుతుంది. ఆ టైమ్‌లో వాళ్ళ రోగ నిరొధక శక్తి ఇంకా పూర్తిగా బలపడి ఉండదు. అందుకని, బేబీ కి సంబంధించినది ఏదైనా బాగా క్లీన్ చేయడం, స్టెరిలైజ్ చేయడం అవసరం. పసిపిల్లలకి బ్యాక్టీరియా చేరుకునే మార్గాలలో నోరు ముఖ్యమైనది. అందుకని, నోట్లో పెట్టుకునే బాటిల్ ని శుభ్రంగా ఉంచాలి. బాటిల్‌లో పాలు ఉండిపోతే, అదే బాటిల్‌తో మళ్ళీ పాలు పడితే బిడ్డకి చాలా ప్రమాదం. అందుకని, ప్లాస్టిక్, గ్లాస్, సిలికాన్... ఏ మెటీరియల్ తో చేసిన బాటిల్ అయినా స్టెరిలైజ్ చేయడం అవసరం.కొత్తగా కొన్న బాటిల్స్ స్టెరిలైజ్ చేయక్కర్లేదనుకుంటారు చాలా మంది. 

 

 


ఇది తప్పు. బాటిల్ కొత్తదైనా, పాతదైనా స్టెరిలైజేషన్ తప్పనిసరి.  ఫీడింగ్ అయిపోయిన వెంటనే బాటిల్ ని వేడి సుబ్బు నీటితో చేత్తో రుద్ది కడగాలి.చేతులు శుభ్రంగా కడుక్కుని శుభ్రమైన  టవల్ తో తుడుచుకోండి.పాల పీక లో ఏమైనా పగుళ్ళు కనిపిస్తే వెంటనే పారేయాలి.బాటిల్స్, పాల పీకలు క్లీన్ చేయడానికి బేబీ బాటిల్ బ్రష్ దొరుకుతుంది. అది మూల మూలకీ వెళ్ళి క్లీన్ చేయగలుగుతుంది.పాల పీక లో నీళ్ళు పోసి నొక్కితే రంధ్రం లోనించి నీరు బైటికి పోయి పాల పీక క్లీన్ అవుతుంది.పాల పీక ని తిరగేసి వేడి నీటితో,  సబ్బు నీటిలో మరొకసారి కడగండి.చివరగా అన్నింటినీ చల్లని టాప్ వాటర్ కింద కడిగి గాలికి ఆరబెట్టండి.

మరింత సమాచారం తెలుసుకోండి: