చాలామంది చిన్న పిల్లలు గోళ్లు కొరుకుతూ ఉంటారు. నిజానికి ఈ అలవాటు చాలామంది పిల్లల్లో చేసే ఉంటాము. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు గోళ్లు బాగా కొరుకుతుంటారు. కొందరైతే వేళ్లు గాయపడి రక్తం వచ్చేలా కొరికేసుకుంటూ ఉంటారు.కొంతమంది చిగుళ్లు దగ్గర దాక కూడా కొరికేసుకుని తర్వత నొప్పి అని ఏడుస్తారు. ఏదో అలవాటులే అని పెద్దవాళ్లు చూసీ చూడనట్టు వదిలేస్తారు. కానీ ఇది వదిలేయాల్సిన విషయం కాదు అంటున్నారు నిపుణులు. గోళ్లు కొరకడం అలవాటుగా మొదలయ్యి  తర్వాత సమస్యగా మారుతుందట.అందుకని చిన్నప్పటి నుండే పిల్లలలో గోళ్లు కొరికే అలవాటును మాన్పించడం మంచిది. అసలు పిల్లలు గోళ్లు ఎందుకు కోరుకుతారో..? గోళ్లు కొరుక్కోవడం ఇలా మాన్పించాలో తెలుసుకోండి.. !!



పిల్లల్లో ఈ అలవాటుని పోగొట్టడానికి ముందు వాళ్ల మనసును చదవాలట. ఒత్తిడి, టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు గోళ్లు ఆటోమేటిగ్గా నోట్లోకి వెళ్లిపోతాయట. కాబట్టి పిల్లలు గోళ్లు కొరుకుతుంటే వాళ్లకేదైనా సమస్యగానీ భయంగానీ ఉందేమో కనుక్కోవాలి. ఒత్తిడి మరీ ఎక్కకువైపోతే అది మెంటల్, ఎమోషనల్ డిజార్డర్ గా మారుతుంది.అదే  కనుక జరిగితే పరిస్థితి ఎంత తీవ్రమవతుందంటే నిద్రలో తమకు తెలీకుండానే గోళ్లు కొరికేసుకుంటారు.  అలా కనుక చేస్తుంటే వెంటనే చైల్డ్ సైకియాట్రిస్టుకి చూపించి సమస్య ఏ స్థాయిలో ఉందో చూపించాలి. వాళ్ల మనసులో ఉన్న భయాలేంటో తెలుసుకుని వాటిని పోగెట్టే ప్రయత్నం చేయాలి




అస్తమానం గోళ్లు కొరుకుతూ ఉంటే... గోళ్లపై పేరుకున్న బ్యాక్టీరియా మట్టి ద్వారా  లాలాజలంతో కలిసి బుజ్జాయిల బొజ్జలోకి వెళ్లిపోతుంది. కాబట్టి వాళ్లు ఆ అలవాటు మానేవరకూ పిల్లల గోళ్లను ఎప్పటికప్పుడు మీరే కత్తిరించేయడం, చేతుల్ని శుభ్రంగా ఉంచటం చేయాలి.
గోళ్లు కొరికే అలవాటున్న పిల్లల్లో ఐక్యూ తక్కువగా ఉంటుందని రష్యాలో జరిపిన ఓ పరిశోధనలో తేలింది. వాళ్లు చాలా డల్ గా ఉంటారట. దేనిలోనూ ప్రతిభ చూపించరట. మీ పిల్లలు కనుక చదువులో వెనుకబడుతుంటే... వాళ్లకి గోళ్లు కొరికే అలవాటుందేమో చూసుకోండి.  మీ పిల్లలు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉండండి. అలాగే గోళ్లు కొరకడాన్ని కూడా లైట్ గా తీసుకోకండి. వీలైనంత త్వరగా ఈ  అలవాటును పోగొట్టండి. ఇదే అలవాటు పిల్లలు పెద్దయ్యాక కూడా కంటిన్యూ అయితే తర్వాత చాలా సమస్యలు వస్తాయి....


మరింత సమాచారం తెలుసుకోండి: