నేటి సమాజంలో చాల మంది పిల్లలు కళ్లజోడితోనే కనపడుతున్నారు. టీవీ, వీడియో గేమ్స్. ఆన్ లైన్ గేమ్స్, సెల్ ఫోన్స్ ఎక్కవగా చూడటంతో చాల మంది పిల్లలకు కంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా.. కంటి చూపు మెరుగుపడాలన్నా కొన్ని జాగ్రత్తలను తీసుకుంటూ..కొన్ని రకాల పదార్థాలను మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఆ ఆహారం ఏమిటో తెలుసుకుందామా.

ముఖ్యంగా పిల్లలకు పెద్దలు టీవీ కానీ ఫోన్ కానీ మరి దగ్గరగా కాకుండా సమాన దూరంలో ఉంచి చూడాలి. ఇక గంటలు గంటలు వాటితో గడపకుండా జాగ్రత్త పడాలి. ఇక ఆహారం  విషయానికి వస్తే  క్యారెట్స్, యాపిల్స్, పాలకూర, బీట్ రూట్, బ్రొకలి, కోడిగుడ్డు వంటి ఆహారం లో  విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజు వారి ఆహారం లో  తీసుకుంటే కంటి చూపు లోపం కలుగదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇక బాదంపప్పులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి . ఇవి కంటి సమస్యలను దూరం చేస్తాయి. కంటి చూపు పెరిగేలా చేస్తాయి. ఆరు బాదం పప్పు ను ప్రతిరోజూ నీటిలో నానబెట్టుకునిపై పొరను తీసి తినాలి. ఇలా చేయడం వలన కంటి సమస్యలుతగ్గుతాయి. విటమిన్ సి ఉసిరికాయల్లో సమృద్ది గా ఉంటుంది. ఇది శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్‌లా పని చేస్తుంది. కనుబొమ్మ లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేయడానికి ఉపయోగపడుతుంది.

అయితే ఒక టేబుల్ స్పూను ఉసిరికాయ జ్యూస్‌ని, ఒక గ్లాసు నీటి లో కలుపుకుని ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం తాగితే కంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక బాదం పప్పు ఒక కప్పు, సోంపు గింజలు అర కప్పు చక్కెర పావు కప్పు తీసుకుని అన్నింటిని కలిపి పొడిచేసుకోవాలి. ఈ పౌడర్ని ఒక టేబుల్ స్పూను చొప్పున తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో కలిపి రాత్రిపూట నిద్ర పోయే  ముందు తాగాలి. ఇలా ప్రతిరోజూ తాగడం వలన కొన్ని రోజులకు  కంటిచూపు పెరుగుతుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: