చిన్న పిల్లలు తల్లిదండ్రులను చూసి పెరుగుతారు. తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తే వారినే చూసి పిల్లలు బిహేవ్ చేస్తారు. అందుకే పెరిగే దశలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల ముందు ద్వేషిస్తున్నట్లు ప్రవర్తించడం, గొడవపడటం, పని చేయమని చెప్పినప్పుడు తిరస్కరించడం, డిమాండింగ్‌గా మాట్లాడటం, బెదిరించడం, బూతులు మాట్లాడటం, సిగరెట్, ఆల్కహాల్ తాగడం వంటి పనులు చేయకూడదు. పిల్లలపై అతి ప్రవర్తన చూపించినా ప్రమాదమే. ఇలాంటి పనులు చేయడం వల్ల పిల్లల ప్రవర్తన కూడా రానురాను అలాగే మారిపోతుంది.

గర్భిణీగా ఉన్నప్పుడే మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. శారీరక సంబంధమైన లోపాలు తలెత్తుతాయి. చెవులు వినబడకపోవడం, చాలా పొడవుగా ఉండటం, అధికంగా మాట్లాడటం, పొగరుబోతు తనం, పనులు ఆలస్యంగా చేయడం, అతిగా భయపడటం, దొంగిలించడం వంటి పనులు చేస్తుంటారు. ఈ లక్షణాలు ఇతరుల తమపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అలా ప్రవర్తిస్తారంట. శారీరక లోపంతో బాధపడే చిన్నారులు.. మాములు పిల్లలతో తొందరగా కలవలేరు. ఎప్పుడూ వీరిద్దరి మధ్య గొడవలే జరుగుతాయి. దీంతో తల్లిదండ్రులు బెదిరించడం, కొట్టడం లాంటివి చేస్తారు. ఇలా చేస్తే పిల్లలు చిన్నప్పటి నుంచి మొండిగా తయారవుతారు.

తల్లిదండ్రులు తరచూ పిల్లలకు శిక్షించడం వల్ల వారిలో అభద్రతా భావం ఏర్పడుతుంది. దీంతో వీరు చాలా మొండిగా తయారవుతారు. అలాగే తయారై తల్లిదండ్రులపై కోపం, ఈర్షను పెంచుకుంటారు. ప్రతీకారం తీర్చుకోవడానికి కూడా వెనుకాడరు. అయితే చిన్న వయసులో నోట్లో వేలు పెట్టుకోవడం, గోళ్లు కొరకడం లాంటివి చేస్తుంటారు. అలాంటి వయసులో పిల్లలు తప్పులు చేస్తుంటారు. కానీ, తల్లిదండ్రులు ఎంతో సహనంగా ఉంటూ వారికి పూర్తి విషయం అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాంటి తప్పులు చేసినా.. ఇలా చేయొద్దంటూ మందలించాలి. వారితో ఆడుకోవడానికి టైం కేటాయించాలి. అప్పుడు తల్లిదండ్రులపై పిల్లలకు ప్రేమ ఏర్పడుతుంది. ఏదైనా పని చేయమని చెప్పినా చేస్తారు. పని చేయనని చెప్పినప్పుడు మీరే చేయాలి. చిన్నప్పటి నుంచి అన్ని పనిలో పిల్లలను ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు తలెత్తవు.

మరింత సమాచారం తెలుసుకోండి: