
కొంతమంది మద్యం తాగటం మానేస్తే చెవుల్లో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయట..అంతేకాదు ఎవరో తమను పిలుస్తున్నట్లు కూడా అనిపిస్తుందట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు. ఎళ్ల తరబడి మద్యం తాగి..ఏదో ఒక్క కారణంతో తాగటం మానేస్తే వారిలో మూడు రోజుల్లోపు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. కోపం, ముందు ఏం ఉందో తెలియని పరిస్థితి, అయోమయంలోకి వెళ్తారు. చాలామంది సరైన ఆహారం తీసుకోకుండా రేయింబవళ్లు మద్యం తాగుతుంటారు. అలాంటి వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కామెర్లు రక్తం గడ్డ కట్టడంతో పాటు మెదడు కణ జాలాన్ని ప్రభావితం చేస్తుంది. షడన్ గా ఆల్కహాల్ మానేయడం వల్ల వచ్చే మానసిక సమస్యలు పెరిగితే ఆ తర్వాతి దేశంలో అది న్యూరోలాజికల్ సమస్యలకు దారితీస్తుంది.
ఈ దశలో వారు అన్నింటిని మర్చిపోతుంటారు. తమకు మతిమరుపు ఉందనే విషయాన్ని చెప్పకుండా ఏదో ఒకటి చెప్పేకుండా ప్రయత్నిస్తుంటారు. దీనికి తోడు నరాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తె అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ తీసుకోవటం మానేయాలనుకునే వారు క్రమేణ తగ్గించుకుంటూ రావాలి. ఒక నెలపాటు వారానికి రెండు సార్లు.. వారానికి కోసారి తగ్గించుకుంటే వసై శరీరం పై ఎలాంటి దుష్పు భవాలు ఉండవు. కాబట్టి ఆల్కహాల్ రోజు తాగే వారికి ఒక్కసారిగా మానా కూడదు. వారానికి ఒక్కసారి అలా తాగుతూ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వస్తే మంచిది.